Homeటాప్ స్టోరీస్టాలెంటెడ్ దర్శకుడితో నాగ్ సినిమా ఫిక్స్

టాలెంటెడ్ దర్శకుడితో నాగ్ సినిమా ఫిక్స్

టాలెంటెడ్ దర్శకుడితో నాగ్ సినిమా ఫిక్స్
టాలెంటెడ్ దర్శకుడితో నాగ్ సినిమా ఫిక్స్

అక్కినేని నాగార్జున కెరీర్ ప్రస్తుతం డల్ ఫేజ్ లో నడుస్తున్న విషయం తెల్సిందే. రెండేళ్ల క్రితం వరకూ నాగ్ వరస హిట్లతో దూసుకుపోయాడు. అయితే రామ్ గోపాల్ వర్మతో చేసిన ఆఫీసర్, ఆ తర్వాత రాహుల్ రవీంద్రన్ తో చేసిన మన్మథుడు 2 దారుణమైన ఫలితాలను అందుకున్నాయి. కంటెంట్ పరంగా కలెక్షన్స్ పరంగా ఈ రెండు సినిమాలు నిరుత్సాహపరచడంతో నాగ్ కొంత గ్యాప్ తీసుకుని కొత్త దర్శకుడు సల్మాన్ తో పనిచేస్తున్నాడు. వైల్డ్ డాగ్ అని టైటిల్ ను పెట్టుకున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా లాక్ డౌన్ కారణంగా బ్రేకులు పడిన విషయం తెల్సిందే.

ఈ సినిమా షూటింగ్ కథ పరంగా ఫారిన్ లో చిత్రీకరించాల్సి ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా ఇప్పట్లో ఈ సినిమా షూటింగ్ జరిగేలా లేదు. ఈలోగా నాగార్జున తన నెక్స్ట్ సినిమాలను సెట్ చేసుకుంటున్నాడు. ఎప్పటినుండో పెండింగ్ లో పెట్టిన బంగార్రాజు ప్రాజెక్ట్ కు పచ్చ జెండా ఊపిన నాగార్జున అంతకంటే ముందే టాలెంటెడ్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటించడానికి ఓకే చెప్పినట్లు సమాచారం.

- Advertisement -

సునీల్ నారంగ్ తో కలిసి శరత్ మరార్ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All