Homeటాప్ స్టోరీస్మహేష్ సినిమాని అవమానించిన నాగార్జున

మహేష్ సినిమాని అవమానించిన నాగార్జున

Nagarjuna insults mahesh babus bharath ane nenu మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను ఈ ఏడాది వేసవిలో విడుదలై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే . అయితే అంతటి సినిమాని మర్చిపోయి ఈ ఏడాది హిట్ అయిన చిత్రాల్లో రంగస్థలం , మహానటి మాత్రమే ఉన్నాయని ఆ రెండు సినిమాల తర్వాత ఇప్పుడు గూఢచారి మాత్రమే హిట్ సినిమాలు అని భరత్ అనే నేను సినిమాని పూర్తిగా మర్చిపోవడమే కాకుండా అవమానించాడు కింగ్ నాగార్జున . గూఢచారి సక్సెస్ మీట్ కు ముఖ్య అతిథి గా వచ్చిన నాగార్జున గూఢచారి చిత్రం గురించి పొగడటం బాగానే ఉంది కానీ అదే సమయంలో రంగస్థలం , మహానటి చిత్రాలతో గూఢచారి మాత్రమే హిట్స్ అని మిగతావి హిట్స్ కాదని వ్యాఖ్యానించాడు నాగార్జున .

అయితే రంగస్థలం విడుదలైన దాదాపు నెలరోజులకు భరత్ అనే నేను చిత్రం విడుదలై బ్లాక్ బస్టర్ అయ్యింది . మళ్ళీ మహేష్ కు సాలిడ్ హిట్ ని ఇచ్చింది . ఇదే కాదు కేవలం 2 కోట్లతో రూపొందిన ఆర్ ఎక్స్ 100 సంచలన విజయం సాధించడమే కాకుండా దాదాపు 20 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది ఆర్ ఎక్స్ 100 చిత్రం . వీటితో పాటుగా ఛలో , తొలిప్రేమ చిత్రాలు కూడా హిట్ సాధించాయి . వాటిని కూడా పట్టించుకోలేదు నాగార్జున . అయితే మిగతా సినిమాల సంగతి పక్కన పెడితే మహేష్ బాబు సినిమాని పక్కన పెట్టడం మరీ దారుణమే !

- Advertisement -

English Title: Nagarjuna insults mahesh babus bharat ane nenu

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All