Homeటాప్ స్టోరీస్చిలసౌ మీద గూఢచారి ఆగ్రహంగా ఉన్నాడు

చిలసౌ మీద గూఢచారి ఆగ్రహంగా ఉన్నాడు

adivi sesh angry on rahul ravindranఆగస్టు 3న చిలసౌ , గూఢచారి చిత్రాలు విడుదలయ్యాయి అయితే రాహుల్ , అడవి శేష్ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ కావడంతో మనిద్దరం పోటీ పడొద్దు గ్యాప్ లో సినిమా రిలీజ్ చేసుకుందామని అనుకున్నాం కానీ తీరా సమయానికి ఓకే డేట్ న రిలీజ్ కావడంతో మా సినిమాకు పోటీ అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు అడవి శేష్ రాహుల్ రవీంద్ర పైన . సుశాంత్ హీరోగా నటించిన చిలసౌ చిత్రానికి రాహుల్ దర్శకత్వం వహించగా నాగార్జున , నాగచైతన్య , సమంత సపోర్ట్ చేసి అన్నపూర్ణ బ్యానర్ పై విడుదల చేసారు . ఆగస్టు 3న విడుదలైన చిలసౌ చిత్రానికి హిట్ టాక్ వచ్చింది అలాగే డీసెంట్ కలెక్షన్లు కూడా వస్తున్నాయి .

అయితే అంతకుమించి వసూళ్ల ని రాబడుతూ శరవేగంగా దూసుకుపోతోంది గూఢచారి చిత్రం . ఇది కూడా ఆగస్టు 3నే విడుదలయ్యింది . అయితే రా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం కావడంతో ఈ చిత్రానికి ప్రేక్షకులు జేజేలు పలుకుతున్నారు దాంతో నాలుగు రోజుల్లోనే పది కోట్ల వసూళ్ల ని సాధించింది . ఇంతటి విజయం సాధించినప్పటికీ అడవి శేష్ కు రాహుల్ పై ఎందుకు కోపమో తెలుసా …….. సోలో గా వచ్చి ఉంటే మరిన్ని వసూళ్లు సాధించేవాడినని ఫీల్ అవుతున్నాడు అందుకే రాహుల్ అంటే కోపం . చిలసౌ కూడా మంచి వసూళ్ల నే సాధిస్తోంది . ఇప్పటివరకు కోటిన్నర షేర్ రాబట్టింది ఆ చిత్రం . ఇంకా కోటి పైనే రాబట్టే ఛాన్స్ ఉంది దానికి తోడు శాటిలైట్ , డిజిటల్ రైట్స్ , డబ్బింగ్ , రీమేక్ రైట్స్ రూపంలో మరిన్ని వసూళ్లు రాబడుతుంది తక్కువబడ్జెట్ లో రూపొందిన చిత్రం కాబట్టి చిలసౌ కూడా హిట్ సినిమానే అన్నమాట .

- Advertisement -

English Title: adivi sesh angry on rahul ravindran

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All