Homeటాప్ స్టోరీస్మొత్తానికి నాగార్జున మొద‌లుపెట్టేశారు!

మొత్తానికి నాగార్జున మొద‌లుపెట్టేశారు!

మొత్తానికి నాగార్జున మొద‌లుపెట్టేశారు!
మొత్తానికి నాగార్జున మొద‌లుపెట్టేశారు!

మూడున్న‌ర నెల‌లుగా షూటింగ్‌లు ఆగిపోయాయ‌ని, శ‌ర‌తుల‌తో కూడిన అనుమ‌తులు ఇవ్వాల్సిందే అంటూ చిత్ర వ‌ర్గాలు రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కోరిన విష‌యం తెలిసిందే. తీరా అనుమ‌తులు ఇచ్చాక క‌రోనా వైర‌స్ కేసులు ప్ర‌మాద‌క‌ర స్థాయికి చేరిపోవ‌డంతో షూటింగ్‌లు చేయాలంటే సీనియ‌ర్ హీరోల నుంచి అప్ క‌మింగ్ హీరోల వ‌ర‌కు భ‌య‌ప‌డుతున్నారు.

ఇదిలా వుంటే ఇటీవ‌ల సీరియ‌ల్ న‌టుల‌కు క‌రోనా సోక‌డం మ‌రింత భ‌యాందోళ‌న‌కు గురిచేసింది. దీంతో మ‌రో బ‌మూడు నెల‌ల త‌రువాతే షూటింగ్‌లు చేద్దామ‌ని అంత వ‌ర‌కు రిస్క్ తీసుకోవ‌డం అవ‌స‌రం లేద‌ని హీరోలంతా త‌మ ద‌ర్శ‌కుల‌కు ముకుమ్మ‌డిగా చెప్పేశార‌ట‌. ఇదిలా వుంటే సీనియ‌ర్ హీరో కింగ్ నాగార్జున అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ సెట్‌లోకి ఎంట‌రైన‌ట్టు తెలిసింది. అయితే అది సినిమా కోసం కాద‌ని, ఓ ప్రోమో కోసం అని తెలిసింది.

- Advertisement -

రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4 త్వ‌ర‌లో ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. ఈ షోకు కూడా నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ షో కోసం నాగ్‌పై ప‌బ్లిసిటీ ప్రోమోని షూట్ చేశార‌ట‌. ఆగ‌స్టు నెలాఖ‌రున బిగ్‌బాస్ సీజ‌న్ 4 స్టార్ట్ కాబోతున్న నేప‌థ్యంలో నాగ్ న‌టించిన ప్రోమోని త్వ‌ర‌లోనే టెలీకాస్ట్ చేయ‌బోతున్నార‌ని తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All