Homeటాప్ స్టోరీస్హారర్ థ్రిల్లర్ లో కనిపించనున్న నాగ చైతన్య

హారర్ థ్రిల్లర్ లో కనిపించనున్న నాగ చైతన్య

హారర్ థ్రిల్లర్ లో కనిపించనున్న నాగ చైతన్య
హారర్ థ్రిల్లర్ లో కనిపించనున్న నాగ చైతన్య

అక్కినేని నాగ చైతన్య కెరీర్ ప్రస్తుతం దూసుకుపోతోంది. వరసగా సినిమాలతో సూపర్ బిజీగా ఉన్నాడు. లవ్ స్టోరీ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ చిత్రాన్ని దాదాపుగా పూర్తి చేసేసాడు. అలాగే ప్రస్తుతం ఆమీర్ ఖాన్ చిత్రం లాల్ సింగ్ చద్దా చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

ఇదిలా ఉంటే నాగ చైతన్య ఒక వెబ్ సిరీస్ కు ఓటేసినట్లు తెలుస్తోంది. శరత్ మరార్ నిర్మాణంలో ఈ 8 ఎపిసోడ్స్ ఉన్న వెబ్ సిరీస్ కు సంబంధించిన ఆసక్తికర డీటెయిల్స్ ఇప్పుడు బయటకు వచ్చాయి. ఇది ఒక హారర్ థ్రిల్లర్. విక్రమ్ కె కుమార్ ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేస్తున్నాడు.

- Advertisement -

ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇది కాకుండా మరో వెబ్ సిరీస్ లో కూడా నటించనున్నాడు నాగ చైతన్య. దాని డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All