Homeటాప్ స్టోరీస్నాగ చైతన్య డిజిటల్ ఎంట్రీ విశేషాలు...

నాగ చైతన్య డిజిటల్ ఎంట్రీ విశేషాలు…

naga chaitanya to make digital debut soon
naga chaitanya to make digital debut soon

అక్కినేని నాగ చైతన్య కెరీర్ ప్రస్తుతం సాఫీగా సాగిపోతోంది. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన లవ్ స్టోరీ విడుదలకు సిద్ధంగా ఉంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ చిత్రాన్ని దాదాపు పూర్తి చేసాడు. ప్రస్తుతం ఆమిర్ ఖాన్ నటిస్తోన్న లాల్ సింగ్ చద్దా షూటింగ్ లో పాల్గొంటున్నాడు చైతన్య.

అలాగే నాగార్జున హీరోగా తెరకెక్కనున్న బంగార్రాజులో చైతన్య కీలక పాత్ర పోషించనున్నాడు. ఇక తాజా సమాచారం ప్రకారం నాగ చైతన్య ఒక వెబ్ బేస్డ్ ఫిల్మ్ లో నటించాలని ఎప్పటినుండో అనుకుంటున్నాడు. ఇప్పుడు దానికి సంబంధించిన విశేషాలు బయటకు వచ్చాయి.

- Advertisement -

ప్రముఖ నిర్మాత శరత్ మరార్ ఒక వెబ్ సిరీస్ ను నిర్మించనున్నాడు. ఈ చిత్రంలో చైతన్య హీరోగా చేయనున్నాడు. స్క్రిప్ట్ విషయంలో అందరు సంతృప్తిగా ఉండడంతో త్వరలోనే షూటింగ్ మొదలవుతుంది. అయితే ఈ వెబ్ ఫిల్మ్ ను ఎవరు డైరెక్ట్ చేస్తారు అన్నది ప్రస్తుతానికి ఇంకా రివీల్ చేయలేదు. త్వరలోనే మరిన్ని విశేషాలు తెలుస్తాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All