Homeటాప్ స్టోరీస్బాలీవుడ్ గేమ్ చేంజర్ – ఆమీర్ ఖాన్

బాలీవుడ్ గేమ్ చేంజర్ – ఆమీర్ ఖాన్

బాలీవుడ్ గేమ్ చేంజర్ – ఆమీర్ ఖాన్
బాలీవుడ్ గేమ్ చేంజర్ – ఆమీర్ ఖాన్

2001లో ఒక బాలీవుడ్ హీరోను మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ సార్… మీతో పాటు సినిమాలు చేసే నటులు “కింగ్”, “బాద్ షా” అని పేర్లు పెట్టుకుంటున్నారు… మరి మీరు ఎవరు.? అని అడిగితే అతను ఒక చిరునవ్వు నవ్వుతూ…. “అగర్ వో కింగ్ హై తో… మై ఇక్కా హూన్..!” (“వాళ్ళు రాజులు అయితే నేను Ace ముక్క..”) అని సమాధానం చెప్పాడు. ఆ విషయాన్ని మీడియా వాళ్ళు లోతుగా విశ్లేషణ చెయ్యకపోయినా అది నిజమే. ఎందుకంటే పేకాట లో ఎన్ని కార్డులు ఉన్న Ace కార్డు విలువ, రేంజ్ వేరు. అలాంటి బాలీవుడ్ ఆసు ముక్క, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్, ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు క్రియేట్ చేసే హీరోఆమీర్ ఖాన్. ఇక ఆమీర్ ఖాన్ గురించి మరింత లోతుగా వెళ్తే,

ఆమీర్ ఖాన్ మొట్టమొదట తన బంధువు అయినా బాలీవుడ్ నటుడు నసీరుద్దిన్ షా “యాదోంకి బారాత్” సినిమాలో బాల నటుడుగా నటించాడు. ఆమీర్ ఖాన్ కి మొట్టమొదట గుర్తింపు ఇచ్చిన సినిమా “ఖయామత్ సే ఖయామత్ తక్”. సినిమాకు ఆయన స్పెషల్ కేటగిరిలో జాతీయ అవార్డు అందుకున్నారు. తర్వాత 1990 లో వచ్చిన “దిల్” సినిమా ఆయనకు మంచి హిట్ గా నిలిచింది. హీరోగా సోలో గుర్తింపు తెచ్చుకున్నా, కానీ కొన్ని కొన్ని సినిమాలలో గెస్ట్ క్యారెక్టర్ లు కూడా చేశాడు ఆమిర్. ఆ తరువాత 1993లో వచ్చిన “హమ్ హై రాహీ ప్యార్ కే”, “అందాజ్ అప్నా అప్నా” సినిమాలు హిట్ గా నిలిచాయి.

- Advertisement -

తరువాత అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో ఆయన నటించిన “బాజీ” సినిమా ఒక సంచలనం. తెలుగు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తో కలిసి అమీర్ ఖాన్ చేసిన “రంగీలా” సినిమా కూడా ఆయనకు పెద్ద హిట్ గా నిలిచింది. 1996లో వచ్చిన “రాజా హిందుస్తానీ” సినిమా లో ఆయనకు నేషనల్ అవార్డు లభించింది తర్వాత “గుల్ హమ్”, “సర్ఫరోష్” మరియు సినిమాలు పెద్ద హిట్ గా నిలిచాయి. 2001 లో తన స్వీయ నిర్మాణంలో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో తెరకెక్కించిన “లగాన్” సినిమా అప్పటి వరకూ తన కెరియర్ లో వచ్చిన సినిమాలు అన్నిటికీ ద్వారా వచ్చిన ఇమేజ్ ను చెరిపేసి ఆయనను గ్లోబల్ స్టార్ ని చేసింది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే గుజరాత్ లో భూకంపం జరగడంతో, సినిమా చిత్రీకరణకు అవరోధం ఏర్పడటం తో పాటు ఎన్నో అవాంతరాలు కూడా ఏర్పడ్డాయి.ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు భారత దేశం నుంచి ఆస్కార్ అవార్డులకు అఫీషియల్ గా నామినేటెడ్ అయ్యింది. జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలను సైతం అందుకుంది. “లగాన్” సినిమా తర్వాత ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో చేసిన “దిల్ చాహతా హై” సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.

అనుకోకుండా అదే సమయంలో వ్యక్తిగత జీవితంలో ఆయన తన భార్యతో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడే ఆమిర్ఖాన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఆయన వెండితెర కు దూరంగా ఉన్నారు. 2005వ సంవత్సరంలో భారత స్వాతంత్ర సమరయోధులు అయినటువంటి “మంగళ్ పాండే” జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన “మంగళ్ పాండే : ద రైజింగ్” సినిమాలో టైటిల్ పాత్రలో పోషించి అద్భుతంగా నటించారు. ఆ తరువాత 2006 సంవత్సరంలో ఆయన నుండి రెండు చిత్రాలు వచ్చాయి. రిహాన్ ఖాద్రీ అనే టెర్రరిస్ట్ పాత్రలో నటించిన “ఫనా” సినిమా కూడా పెద్ద హిట్ గా నిలిచింది. ఇక రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వం లో నలుగురు హీరోలలో ఒక హీరోగా కలిసి ఆయన నటించిన సినిమా “రంగ్ దే బసంతి” ఈ సినిమా కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది

ఇక ఆ తర్వాత ఆమీర్ ఖాన్ తన సొంత నిర్మాణ సంస్థను నెలకొల్పి దర్శకత్వం కూడా నిర్వహిస్తూ “తారే జమీన్ పర్” అనే ఒక సందేశాత్మక సినిమా నిర్మించారు.”ఇషాన్” అనే ఒక బాలుడు ఈ సినిమాలో హీరో. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే ఇంటర్వెల్ వరకు ఆమీర్ ఖాన్ ఈ సినిమాలో కనపడడు. మొదట అందరూ ఆమిర్ ఖాన్ ఎదో ఆర్టు సినిమా తీస్తున్నాడు…! అని హేళన చేసినా … తర్వాత ఇది హార్ట్ టచింగ్ మూవీ అని తెలిసి అందరూ ఆయనను అభినందించారు. ఇక 2008లో తెలుగు నిర్మాత అల్లు అరవింద్ అమీర్ ఖాన్ తో కలిసి తమిళంలో సూర్య నటించిన “గజిని” సినిమాను హిందీలో రీమేక్ చేశారు. ఇక ఈ సినిమా అప్పటి వరకు ఉన్న కలెక్షన్ రికార్డులను బద్దలు కొట్టి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.

2009లో రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో “త్రీ ఇడియట్స్” అనే సినిమా చేశాడు ఆమిర్. ఈ సినిమాలో కూడా హీరో పాత్ర డామినేషన్ లాగా కాకుండా ముగ్గురు స్నేహితులలో ఒకడి గానే కనిపిస్తాడు. ఈ సినిమా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో కొత్త రికార్డులను సృష్టించింది. ఆ తర్వాత కొన్ని చిత్రాలను నిర్మించిన ఆమిర్, 2014లో “ధూమ్ 3” అనే సినిమాలో ద్విపాత్రాభినయం చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. 2014లో అమీర్ ఖాన్నటించిన “ PK” సినిమా వేరే గ్రహం నుంచి వచ్చిన వ్యక్తి గా తన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. 2016 సంవత్సరంలో మల్లయుద్ధం యోధుడు “మహావీర్ సింగ్ ఫోగట్” జీవితకథ బయోపిక్ అయినటువంటి “దంగల్” సినిమాలో నటించాడు. ఈ సినిమా ఇప్పటి వరకు ఉన్న బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి కొత్త రికార్డును సృష్టించింది.

ఈ సినిమాలో తండ్రి పాత్ర కోసం ఆమిర్ విపరీతంగా బరువు పెరిగి, మళ్లీ మల్లయుద్ధం యోధుడు పాత్ర కోసం మళ్లీ తగ్గాడు. 2018లో మళ్లీ యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పై గతంలో “ధూమ్ 3” సినిమా తెరకెక్కించిన విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం లోనే “థగ్స్ ఆఫ్ హిందుస్థాన్” సినిమా చేశాడు.ఈ సినిమా అంతగా విజయం సాధించలేదు. ప్రస్తుతం అమీర్ ఖాన్ “లాల్ సింగ్ చద్దా” అనే సినిమా చేస్తున్నాడు. హాలీవుడ్ సినిమా అయిన “ఫారెస్ట్ గంప్” కు ఇది రీమేక్. బుల్లితెరపై “సత్యమేవ జయతే” లాంటి సందేశాత్మకమైన ప్రోగ్రామ్స్ కూడా చేశాడు ఆమిర్ ఖాన్.

తన సినిమాల విషయంలో ప్రతి విభాగంలోనూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడు.. ఆమిర్ ఖాన్. ముఖ్యంగా తన సినిమాలను కొత్త కొత్త ఐడియాలతో ప్రమోట్ చేసుకోవడం లో ఆయనకు ఆయనే సాటి. 30 ఏళ్ళ సినిమా కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు నటించి, నిర్మించి, దర్శకత్వం వహించినా కూడా అవార్డు ఫంక్షన్లకు మాత్రం ఎప్పుడూ దూరంగా ఉంటారు. సినిమా ఉన్నంతసేపు పబ్లిక్ అందుబాటులో ఉంటారు ఆ తర్వాత పర్సనల్ స్పేస్ కి వెళ్ళిపోతారు. అనవసరమైన ఆర్భాటాలు, ప్రచారాలు మరియు పబ్లిసిటీ లకు ఆమీర్ ఖాన్ దూరంగా ఉంటారు. మన మొదటి చెప్పుకున్నట్లు పేకాట లో ఎన్ని కార్డులు ఉన్నా Ace కార్డు విలువ దానిదే. అలాంటి వాడే ఆమీర్ ఖాన్. ఆయన ఇంకా మరెన్నో అద్భుతమైన సినిమాలతో మనల్ని అలరించాలని కోరుకుందాం.

2001లో ఒక బాలీవుడ్ హీరోను మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ సార్… మీతో పాటు సినిమాలు చేసే నటులు “కింగ్”, “బాద్ షా” అని పేర్లు పెట్టుకుంటున్నారు… మరి మీరు ఎవరు.? అని అడిగితే అతను ఒక చిరునవ్వు నవ్వుతూ…. “అగర్ వో కింగ్ హై తో… మై ఇక్కా హూన్..!” (“వాళ్ళు రాజులు అయితే నేను Ace ముక్క..”) అని సమాధానం చెప్పాడు. ఆ విషయాన్ని మీడియా వాళ్ళు లోతుగా విశ్లేషణ చెయ్యకపోయినా అది నిజమే. ఎందుకంటే పేకాట లో ఎన్ని కార్డులు ఉన్న Ace కార్డు విలువ, రేంజ్ వేరు. అలాంటి బాలీవుడ్ ఆసు ముక్క, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్, ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు క్రియేట్ చేసే హీరోఆమీర్ ఖాన్. ఇక ఆమీర్ ఖాన్ గురించి మరింత లోతుగా వెళ్తే,

ఆమీర్ ఖాన్ మొట్టమొదట తన బంధువు అయినా బాలీవుడ్ నటుడు నసీరుద్దిన్ షా “యాదోంకి బారాత్” సినిమాలో బాల నటుడుగా నటించాడు. ఆమీర్ ఖాన్ కి మొట్టమొదట గుర్తింపు ఇచ్చిన సినిమా “ఖయామత్ సే ఖయామత్ తక్”. సినిమాకు ఆయన స్పెషల్ కేటగిరిలో జాతీయ అవార్డు అందుకున్నారు. తర్వాత 1990 లో వచ్చిన “దిల్” సినిమా ఆయనకు మంచి హిట్ గా నిలిచింది. హీరోగా సోలో గుర్తింపు తెచ్చుకున్నా, కానీ కొన్ని కొన్ని సినిమాలలో గెస్ట్ క్యారెక్టర్ లు కూడా చేశాడు ఆమిర్. ఆ తరువాత 1993లో వచ్చిన “హమ్ హై రాహీ ప్యార్ కే”, “అందాజ్ అప్నా అప్నా” సినిమాలు హిట్ గా నిలిచాయి. తరువాత అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో ఆయన నటించిన “బాజీ” సినిమా ఒక సంచలనం. తెలుగు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తో కలిసి అమీర్ ఖాన్ చేసిన “రంగీలా” సినిమా కూడా ఆయనకు పెద్ద హిట్ గా నిలిచింది. 1996లో వచ్చిన “రాజా హిందుస్తానీ” సినిమా లో ఆయనకు నేషనల్ అవార్డు లభించింది తర్వాత “గుల్ హమ్”, “సర్ఫరోష్” మరియు సినిమాలు పెద్ద హిట్ గా నిలిచాయి. 2001 లో తన స్వీయ నిర్మాణంలో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో తెరకెక్కించిన “లగాన్” సినిమా అప్పటి వరకూ తన కెరియర్ లో వచ్చిన సినిమాలు అన్నిటికీ ద్వారా వచ్చిన ఇమేజ్ ను చెరిపేసి ఆయనను గ్లోబల్ స్టార్ ని చేసింది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే గుజరాత్ లో భూకంపం జరగడంతో, సినిమా చిత్రీకరణకు అవరోధం ఏర్పడటం తో పాటు ఎన్నో అవాంతరాలు కూడా ఏర్పడ్డాయి.ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు భారత దేశం నుంచి ఆస్కార్ అవార్డులకు అఫీషియల్ గా నామినేటెడ్ అయ్యింది. జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలను సైతం అందుకుంది. “లగాన్” సినిమా తర్వాత ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో చేసిన “దిల్ చాహతా హై” సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.

అనుకోకుండా అదే సమయంలో వ్యక్తిగత జీవితంలో ఆయన తన భార్యతో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడే ఆమిర్ఖాన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఆయన వెండితెర కు దూరంగా ఉన్నారు. 2005వ సంవత్సరంలో భారత స్వాతంత్ర సమరయోధులు అయినటువంటి “మంగళ్ పాండే” జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన “మంగళ్ పాండే : ద రైజింగ్” సినిమాలో టైటిల్ పాత్రలో పోషించి అద్భుతంగా నటించారు. ఆ తరువాత 2006 సంవత్సరంలో ఆయన నుండి రెండు చిత్రాలు వచ్చాయి. రిహాన్ ఖాద్రీ అనే టెర్రరిస్ట్ పాత్రలో నటించిన “ఫనా” సినిమా కూడా పెద్ద హిట్ గా నిలిచింది. ఇక రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వం లో నలుగురు హీరోలలో ఒక హీరోగా కలిసి ఆయన నటించిన సినిమా “రంగ్ దే బసంతి” ఈ సినిమా కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది

ఇక ఆ తర్వాత ఆమీర్ ఖాన్ తన సొంత నిర్మాణ సంస్థను నెలకొల్పి దర్శకత్వం కూడా నిర్వహిస్తూ “తారే జమీన్ పర్” అనే ఒక సందేశాత్మక సినిమా నిర్మించారు.”ఇషాన్” అనే ఒక బాలుడు ఈ సినిమాలో హీరో. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే ఇంటర్వెల్ వరకు ఆమీర్ ఖాన్ ఈ సినిమాలో కనపడడు. మొదట అందరూ ఆమిర్ ఖాన్ ఎదో ఆర్టు సినిమా తీస్తున్నాడు…! అని హేళన చేసినా … తర్వాత ఇది హార్ట్ టచింగ్ మూవీ అని తెలిసి అందరూ ఆయనను అభినందించారు. ఇక 2008లో తెలుగు నిర్మాత అల్లు అరవింద్ అమీర్ ఖాన్ తో కలిసి తమిళంలో సూర్య నటించిన “గజిని” సినిమాను హిందీలో రీమేక్ చేశారు. ఇక ఈ సినిమా అప్పటి వరకు ఉన్న కలెక్షన్ రికార్డులను బద్దలు కొట్టి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.

2009లో రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో “త్రీ ఇడియట్స్” అనే సినిమా చేశాడు ఆమిర్. ఈ సినిమాలో కూడా హీరో పాత్ర డామినేషన్ లాగా కాకుండా ముగ్గురు స్నేహితులలో ఒకడి గానే కనిపిస్తాడు. ఈ సినిమా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో కొత్త రికార్డులను సృష్టించింది. ఆ తర్వాత కొన్ని చిత్రాలను నిర్మించిన ఆమిర్, 2014లో “ధూమ్ 3” అనే సినిమాలో ద్విపాత్రాభినయం చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. 2014లో అమీర్ ఖాన్నటించిన “ PK” సినిమా వేరే గ్రహం నుంచి వచ్చిన వ్యక్తి గా తన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. 2016 సంవత్సరంలో మల్లయుద్ధం యోధుడు “మహావీర్ సింగ్ ఫోగట్” జీవితకథ బయోపిక్ అయినటువంటి “దంగల్” సినిమాలో నటించాడు. ఈ సినిమా ఇప్పటి వరకు ఉన్న బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి కొత్త రికార్డును సృష్టించింది.

ఈ సినిమాలో తండ్రి పాత్ర కోసం ఆమిర్ విపరీతంగా బరువు పెరిగి, మళ్లీ మల్లయుద్ధం యోధుడు పాత్ర కోసం మళ్లీ తగ్గాడు. 2018లో మళ్లీ యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పై గతంలో “ధూమ్ 3” సినిమా తెరకెక్కించిన విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం లోనే “థగ్స్ ఆఫ్ హిందుస్థాన్” సినిమా చేశాడు.ఈ సినిమా అంతగా విజయం సాధించలేదు. ప్రస్తుతం అమీర్ ఖాన్ “లాల్ సింగ్ చద్దా” అనే సినిమా చేస్తున్నాడు. హాలీవుడ్ సినిమా అయిన “ఫారెస్ట్ గంప్” కు ఇది రీమేక్. బుల్లితెరపై “సత్యమేవ జయతే” లాంటి సందేశాత్మకమైన ప్రోగ్రామ్స్ కూడా చేశాడు ఆమిర్ ఖాన్.

తన సినిమాల విషయంలో ప్రతి విభాగంలోనూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడు.. ఆమిర్ ఖాన్. ముఖ్యంగా తన సినిమాలను కొత్త కొత్త ఐడియాలతో ప్రమోట్ చేసుకోవడం లో ఆయనకు ఆయనే సాటి. 30 ఏళ్ళ సినిమా కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు నటించి, నిర్మించి, దర్శకత్వం వహించినా కూడా అవార్డు ఫంక్షన్లకు మాత్రం ఎప్పుడూ దూరంగా ఉంటారు. సినిమా ఉన్నంతసేపు పబ్లిక్ అందుబాటులో ఉంటారు ఆ తర్వాత పర్సనల్ స్పేస్ కి వెళ్ళిపోతారు. అనవసరమైన ఆర్భాటాలు, ప్రచారాలు మరియు పబ్లిసిటీ లకు ఆమీర్ ఖాన్ దూరంగా ఉంటారు. మన మొదటి చెప్పుకున్నట్లు పేకాట లో ఎన్ని కార్డులు ఉన్నా Ace కార్డు విలువ దానిదే. అలాంటి వాడే ఆమీర్ ఖాన్. ఆయన ఇంకా మరెన్నో అద్భుతమైన సినిమాలతో మనల్ని అలరించాలని కోరుకుందాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All