
అక్కినేని నాగ చైతన్య, సమంత మధ్య ఏం జరుగుతోంది? సోషల్ మీడియాలో గత కొన్ని వారాలుగా ఇదే చర్చ. నాగ చైతన్య, సమంత విడిపోనున్నారని, డివోర్స్ తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో అటు సమంత కానీ ఇటు నాగ చైతన్య కానీ వేరెవరైనా కానీ క్లారిటీ ఇచ్చింది లేదు.
దానికి తోడు సోషల్ మీడియాలో ఒకరినొకరు పిలుచుకునే విధానం, ట్వీట్ చేసే విధానంలో కూడా తేడా వచ్చినట్లు అందరూ అనుకుంటున్నారు. నిన్న విడుదలైన లవ్ స్టోరీ ట్రైలర్ దీనికి ప్రధాన ఉదాహరణ. లవ్ స్టోరీ టీజర్ విషయంలో నాగ చైతన్యను తెగ పొగిడిన సమంత, ట్రైలర్ విషయంలో మాత్రం చైతన్యను అసలు ట్యాగ్ కూడా చేయలేదు.
పోనీ తన ట్వీట్ నే మెన్షన్ చేసిందిలే అని అనుకున్నా, నాగ చైతన్య నిన్న అంతా సమంత ట్వీట్ కు రిప్లై ఇవ్వలేదు. ఈరోజు ఉదయం మాత్రం థాంక్స్ సామ్ అని రిప్లై ఇచ్చాడు.
ఇద్దరి మధ్యా ఏ సమస్య లేదనుకోవాలా? లేక ట్వీట్ల విధానం బట్టి ఏదో జరుగుతోంది అనుకోవాలా?