Homeటాప్ స్టోరీస్నాంది దర్శకుడికి ఓకే చెప్పిన నాగ చైతన్య

నాంది దర్శకుడికి ఓకే చెప్పిన నాగ చైతన్య

నాంది దర్శకుడికి ఓకే చెప్పిన నాగ చైతన్య
నాంది దర్శకుడికి ఓకే చెప్పిన నాగ చైతన్య

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం ఫుల్ ఫ్లో లో ఉన్నాడు. తను నటించిన లవ్ స్టోరీ సెప్టెంబర్ 10న విడుదలకు సిద్ధమైంది. అలాగే చైతన్య తన నెక్స్ట్ మూవీ థాంక్యూను దాదాపుగా పూర్తి చేసాడు. బాలీవుడ్ లో సైతం నాగ చైతన్య అడుగు పెడుతున్నాడు. ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాలో నాగ చైతన్య కీలక పాత్ర పోషిస్తున్నాడు.

తాజా సమాచారం ప్రకారం నాగ చైతన్య మరో సినిమాను కన్ఫర్మ్ చేసాడు. నాంది వంటి పవర్ఫుల్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన విజయ్ కనకమేడల చెప్పిన కథ చైతన్యకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చేసాడు. ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు త్వరలోనే మొదలవుతాయి.

- Advertisement -

సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తారు. మరోవైపు నాగ చైతన్య డిజిటల్ డెబ్యూ కూడా ఇవ్వబోతున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అమెజాన్ ప్రైమ్ కోసం వెబ్ సిరీస్ లో నటిస్తాడు నాగ చైతన్య.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All