
అక్కినేని వారబ్బాయి నాగచైతన్య మునుపెన్నడూ లేనంతగా సినిమా ల విషయంలో స్పీడు పెంచేశారు. ప్రస్తుతం సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో `లవ్‌స్టోరీ` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇటీవలై పునః ప్రారంభమైంది. చక చకా పూర్తి చేసి చిత్రాన్ని త్వరలో రిలీజ్ చేయాలని శేఖర్ కమ్ముల ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా వుంటే నాగచైతన్య ఈ మూవీ అండర్ ప్రొడక్షన్‌లో వుండగానే మరో రెండు చిత్రాల్ని లైన్‌లో పెట్టేశారు. తమ ఫ్యామిలీకి `మనం` వంటి మెమోరముల్ ఫిల్మ్‌ని అందించిన విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. `థ్యాక్యూ` పేరుతో రూపొందనున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్నారు.
ఇదిలా వుంటే అనిల్ రావిపూడితో మరో చిత్రాన్ని ఓకే చేసినట్టు తెలిసింది. సాహు గారపటి నిర్మాతగా ఇంద్రగంటి మోహనకృష్ణ చిత్రాన్ని చేయాల్సి వుంది. అయితే `వి` ఫలితంతో ఆ చిత్రాన్ని పక్కన పెట్టి అనిల్‌రావిపూడితో సాహు గారపటి ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో నాగచైతన్య హీరోగా నటించడానికి ఓకే చెప్పేశారట. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే రానున్నట్టు ఇన్ సైడ్ టాక్.