
శ్రీలంకన్ క్రికెటర్, స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా `800` పేరుతో ఓ బయోపిక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. మురళీధరన్ పాత్రలో తమిళ నటుడు, హీరో విజయ్ సేతుపతి నటిస్తున్నారు. ఎం.ఎస్. శ్రీపతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ట్రైన్ మోషన్ పిక్చర్స్, వివేక్ రంగాచారి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ తో పాటు విజయ్ సేతపతికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు.
తమిళులని ఊచకోత కోసిన శ్రీలంక కు చెందిన వ్యక్తి బయోపిక్‌లో విజయ్ సేతుపతి నటించడం ఏంటని నిలదీస్తూ తమిళ సంఘాలు, ప్రజలు, తమిళ ఇండస్ట్రీకి చెందిన పలువురు దర్శకులు డిమాండ్ చేస్తున్నారు.. వెంటనే విజయ్ సేతుపతి ఈ సినిమా నుంచి తప్పుకోవాలని మండిపడుతున్నారు. దీంతో తమిళనాట ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ వివాదంగా మారింది. దీనిపై మురళీధరన్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా ఓ ప్రెస్ నోట్‌ని విడుదల చేశారు.
శ్రీలంకలో పుట్టిన తమిళుడినని చెప్పుకున్న మురళీధరన్ యుద్ధభూమిలో పుట్టిన నేను ఏడేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయానని, ఎంతో వివక్షకు గురయ్యానని స్పష్టం చేశారు. అలాంటి ప్రదేశంలో సవాళ్లని ఎదుర్కొని ఎలా తను ఈ స్థాయికి వచ్చానన్నది ఈ చిత్రంలో చూపిస్తారనుకున్నాని, కానీ ఈ చిత్రాన్ని అనవసరంగా రాజకీయం చేస్తున్నారని, 2009లో తాను తప్పుగా అర్థం చేసుకుని అన్న మాటలు ఇప్పటికీ తనని వెంటాడుతున్నాయన్నారు. భారతీరాజా, చేరన్ వంటి దర్శకులు ఈ చిత్రాన్ని వ్యతిరేకిస్తుంటే రాధిక మాత్రం విజయ్ సేతుపతికి మద్దతుగా నిలుస్తుండటం విశేషం.