
శ్రీలంక లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా `800` పేరుతో ఓ మూవీ తెరపైకి రానున్న విషయం తెలిసిందే. ఇందులో ముత్తయ్య మురళీధరన్ గా తమిళ హీరో విజయ్ సేతుపతి కనిపించబోతున్నారు. ఎం.ఎస్. శ్రీపతి దర్శకత్వం వహిస్తున్నారు. ట్రైన్ మోషన్ పిక్చర్స్ , వివేక్ రంగాచారి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన టైటిల్ లుక్‌తో పాటు విజయ్ సేతుపతి లుక్‌ని కూడా రిలీజ్ చేశారు. అప్పటి నుంచి విజయ్ సేతుపతిపై నెట్టింట్లో ట్రోల్స్ మొదలయ్యాయి. శ్రీలంకలో తమిళులని అత్యంత దారుణంగా చంపేసింది శ్రీలంక సైన్యం. గత కొన్ని దశాబ్దాలుగా సింహాలీయులకీ, తమిళులకీ సమరం సాగుతోంది. ఈ సమరంలో ఎంతో మంది తమిళులు అసువులు బాసారు. శ్రీలంకలో వున్న తమిళుల కోసం పోరాడిన వేళు పళ్లై ప్రభాకరన్ శ్రీలంక సైన్యం చేతిన దారుణ హత్యకు గురయ్యారు.
శ్రీలంక తమిళులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసక్తోందని, ఈ విధానాన్ని నికి మురళీధరన్ కూడా మద్దతుగా నిలిచాడని, అలాంటి నమ్మకద్రోహి జీవితకథలో విజయ్ సేతుపతి నటించడానికి వీళ్లేదని దర్శకుడు భారతీరాజా మండిపడ్డారు. ఆయనతో పాటు దర్శకులు శ్రీను రామస్వామి, చేరన్ కూడా విజయ్ సేతుపతి `800`లో నటించడానికి వీళ్లేదని డిమాండ్ చేస్తున్నారు.