
వెర్సటైల్ యాక్టర్‌గా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న హీరో విజయ్ సేతుపతిని నెటిజన్స్ నెట్టింట్లో ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు. #ShameOnVijaySethupathi అంటూ అతన్ని అవమానిస్తున్నారు. ట్విట్టర్‌లో ఈ హ్యాష్ ట్యాగ్ టాప్ ట్రెండింగ్‌లో వుంది. వివారాల్లోకి వెళితే.. శ్రీలంక క్రికెటర్ తన స్పిన్నర్ మాయాజాలంతో వరల్డ్ వైడ్‌గా పాపులర్ అయిన ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా ఓ బయోపిక్ తెరపైకి రాబోతోంది. దీనికి `800` అనే టైటిల్‌ని కూడా ఫిక్స్ చేశారు.
ఇటీవలే టైటిల్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ని కూడా రిలీజ్ చేశారు. ఎం.ఎస్. శ్రీపతి దర్శకత్వంలో ట్రైన్ మోషన్ పిక్చర్స్, వివేక్ రంగాచారి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరల్డ్ టెస్ట్ క్రికెట్‌లో 800 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ముత్తయ్య మురళీధరన్ ఘనతని సాధించారు. ఇందులో మురళీధరన్ గా తమిళ హీరో విజయ్ సేతుపతి కనిపించబోతున్నారు. దీంతో ఈ మూవీ టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది.
శ్రీలంకలో గత కొన్ని దశాబ్దాలుగా తమిళులపై దాడులు జరుగుతూనే వున్నాయి. తమిళులు హక్కుల కోసం పోరాడిన వారిని శ్రీలంక సైన్యం ఊచకోత కోసింది. అత్యంత దారుణంగా హతమార్చింది. అలాంటి శ్రీలంక ఆటగాడి పాత్రలో ఆ దేశ జెండాన్ని గుండెలపై మోస్తూ ఓ తమిళుడు నటించడం తమిళ వర్గాలు సహించలేకపోతున్నాయి. తీవ్ర ఆగ్రహావేశాల్ని వ్యక్తం చేస్తున్నాయి. ఆ కారణంగానే విజయ్ సేతుపతిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. #ShameOnVijaySethupathi అంటూ మండిపడుతున్నారు. దీంతో ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌గా మారింది. ఊహించని వ్యతిరేకతకు కంగుతున్ని మేకర్స్ ముందుకు వెళతారా ? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.