Homeటాప్ స్టోరీస్దర్బార్ ట్రైలర్: మురుగదాస్ దాచిపెట్టాడా?

దర్బార్ ట్రైలర్: మురుగదాస్ దాచిపెట్టాడా?

దర్బార్ ట్రైలర్: మురుగదాస్ దాచిపెట్టాడా?
దర్బార్ ట్రైలర్: మురుగదాస్ దాచిపెట్టాడా?

సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చేయడం మురుగదాస్ కు ఒక కల. దాదాపు పుష్కర కాలం నుండి ప్రయత్నిస్తుంటే రజినీతో సినిమా చేసే ఛాన్స్ ఇప్పటికి వచ్చింది మురుగకి. దీంతో దర్బార్ కథ అదిరిపోతుందని, మురుగదాస్ కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్ గా దీన్ని తీర్చిదిద్దుతాడని అభిమానులు ఆశించారు. మురుగదాస్ సినిమా అంటేనే ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. కథలో ఏదో స్పెషలిటీ ఉంటుంది. గజినీ, తుపాకీ, కత్తి వంటి సినిమాలతో మురుగదాస్ తన విలక్షణతను ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. అయితే గత కొంత కాలంగా మురుగదాస్ తన పట్టుని కోల్పోయాడేమో అనిపించేలా సినిమాలు తీస్తున్నాడు.

మహేష్ బాబుతో తీసిన స్పైడర్, విజయ్ తో తీసిన సర్కార్ సినిమాలు ఇవి అసలు మురుగ సినిమాలే అనిపించేలా ఉంటాయి. ఈ నేపథ్యంలో రజినీతో సినిమా అనగానే ఎలాంటి సినిమా అందిస్తాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. నిన్న మురుగదాస్ రజినీకాంత్ తో తెరకెక్కించిన దర్బార్ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లో అందరూ ఆశించినట్లే రజినీ మార్క్ స్పష్టంగా కనిపించింది. బ్యాడ్ పోలీస్ గా రజిని అరిపించాడు. తనదైన శైలిలో డైలాగులు చెబుతూ, తన మ్యానరిజమ్స్ తో అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు ట్రైలర్ లో చూపించారు. ట్రైలర్ అంతటా రజినీ మాయ కమ్మేసింది. మిగతా నటీనటులను కూడా చూపించినా ఫోకస్ మొత్తం మాత్రం రజినీ మీదే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

- Advertisement -

ఇదంతా బానే ఉంది కానీ మురుగదాస్ సినిమాల నుండి ఆశించే అంశాలు మాత్రం ట్రైలర్ లో కనిపించలేదు. అయితే కావాలనే దాచిపెట్టారా లేక మురుగదాస్ ఈసారి కంప్లీట్ గా రజినీ మేనియాని వాడుకుందామని ఫిక్స్ అయ్యాడా అన్నది చూడాలి. మురుగదాస్ లాంటి దర్శకుడు కేవలం హీరో ఇమేజ్ ఆధారంగా సినిమాలు తీస్తాడని ఊహించలేం కాబట్టి కచ్చితంగా కథలో, స్క్రీన్ ప్లే లో ఏదో స్పెషలిటీని వాడే ఉంటాడు అని ఆశిస్తున్నారు అభిమానులు.

అనిరుధ్ అందించిన సంగీతం ఈ చిత్రానికి మెయిన్ ప్లస్ కానుంది. పాటలు కానీ ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కానీ అదిరిపోయింది. నయనతార హీరోయిన్ గా నటించిన సంగతి తెల్సిందే. దర్బార్ సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయబోతోంది. మరి రజిని-మురుగదాస్ కాంబో ఎటువంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All