Homeగాసిప్స్మురుగదాస్ పేరు మళ్ళీ టాలీవుడ్ లో వినిపిస్తోందేంటి?

మురుగదాస్ పేరు మళ్ళీ టాలీవుడ్ లో వినిపిస్తోందేంటి?

AR Murugadoss
మురుగదాస్ పేరు మళ్ళీ టాలీవుడ్ లో వినిపిస్తోందేంటి?

ఏఆర్ మురుగదాస్ కు తెలుగులో చాలా పేరుంది. ఈయన తమిళ సినిమాలు ఇక్కడ డబ్బింగ్ అయి మంచి ఫలితాన్ని అందుకున్నాయి. తెలుగులో కూడా చిరంజీవితో స్టాలిన్, మహేష్ తో స్పైడర్ తీసాడు మురుగ. ముఖ్యంగా స్పైడర్ సినిమా అందించిన ఫలితంతో మళ్ళీ టాలీవుడ్ లో సినిమా గురించి ప్రస్తావన రాలేదు. అయితే గత రెండు రోజులుగా మురుగదాస్ పేరు టాలీవుడ్ లో ప్రముఖంగా వినిపిస్తోంది. తెలుగు – తమిళ్ లో సినిమా చేయడానికి మురుగదాస్ బన్నీ మధ్య చర్చలు జరిగినట్లు, దాని తర్వాత మురుగదాస్ – ఎన్టీఆర్ కూడా కలిసినట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.

నిజానికి అల్లు అర్జున్ ఎప్పటినుండో ద్విభాషా చిత్రం చేయాలని అనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో మురుగదాస్ తో సినిమా ఆలోచన వచ్చింది, అయితే ప్రచారం జరిగినట్లు ఇద్దరి మధ్యా చర్చలు జరగలేదు. అది ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది. ఇంకా ఎన్టీఆర్ తో సినిమా ఆలోచన ప్రతిపాదన వరకూ రాలేదు. అసలు ముగ్గురూ కూడా ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు.

- Advertisement -

మురుగదాస్ ప్రస్తుతం రజినీతో దర్బార్ చేస్తున్నాడు. అది పూర్తయ్యాక విజయ్ తో సినిమా ఉంటుంది. ఇక అల్లు అర్జున్ ఇంతకంటే బిజీ. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా పూర్తి చేయాలి. తర్వాత సుకుమార్ తో సినిమా, ఆ తర్వాత వేణుశ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ సినిమాలు ఉన్నాయి.

ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది వచ్చే వేసవికి కానీ పూర్తవ్వదు. ఇది పూర్తయితే కొరటాల శివతో సినిమా చర్చల దశలో ఉంది. సో, ఈ ముగ్గురూ కూడా మరో ఏడాదికి పైగా ఫుల్ బిజీ. అందుకే మురుగ – బన్నీ, మురుగ – ఎన్టీఆర్ సినిమాల మీద వచ్చిన వార్తలన్నీ ఒట్టి గాసిప్స్ మాత్రమే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All