
2012లో బ్రిలియంట్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ తెరకెక్కించిన చిత్రం `తుపాకి`. ఇళయదళపతి విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో సంచలన విజయాన్ని సాధించింది. స్లీపర్ సెల్స్ అనే అంశాన్ని తీసుకుని మురుగదాస్ తెరకెక్కించిన తీరు ప్రతీ ఒక్కరినీ ఔరా అనిపించింది. స్లీపర్ సెల్స్ ఎలా వుంటారు?.. ఏం చేస్తారు?.. ఎలా స్పందిస్తారు? వారి వల్ల ఎలాంటి వినాశనం ఏర్పడుతుంది? వంటి అంశాల్ని సామాన్య ప్రేక్షకులకి సైతం ఈ సినిమాతో వివరించే ప్రయత్నం చేశారు మురుగదాస్.
రెండు భాషల్లోనూ విజయం సాధించిన ఈ చిత్రానికి సీక్వెల్ని చేయాలని వుందని ఇటీవల `దర్బార్` రిలీజ్ టైమ్‌లో దర్శకుడు మురుగదాస్ సూచన ప్రాయంగా వెల్లడించారు. ఇటీలవ ఈ చిత్రంతో వివాదాల్లో చిక్కుకున్న మురుగదాస్ ఈ దఫా బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుని తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలనుకుంటున్నారట. ఇప్పటికే ఈ చితత్రం కోసం మురుగదాస్ ఓ లైన్‌ని అనుకున్నారట. విదేశాల్లో అత్యధిక భాగం షూటింగ్ జరుపుకునే ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో వుంటుందని తెలిసింది. ఒక విధంగా చెప్పాలంటే పాన్ ఇండియా మూవీ అన్నమాట.
ఈ చిత్రం కోసం 170 కోట్ల బడ్జెట్‌తో నిర్మించే అవకాశం వుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఎవరు నిర్మాస్తారు? ఎప్పుడు మొదలవుతుంది వంటి విషయాల్ని త్వరలోనే మురుగదాస్ వెల్లడించనున్నట్టు తెలిసింది. విజయ్ ప్రస్తుతం `ఖైదీ` ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో `మాస్టర్` చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. దీని తరువాత మురుగదాస్ చిత్రం వుంటుందట.