Homeటాప్ స్టోరీస్నయనతార వివాదంపై స్పందించిన మురుగ

నయనతార వివాదంపై స్పందించిన మురుగ

నయనతార వివాదంపై స్పందించిన మురుగ
నయనతార వివాదంపై స్పందించిన మురుగ

చాలా మంది హీరోయిన్లకు తర్వాత వేధించే సమస్య కెరీర్ మొదట్లో చేసిన పాత్రలు. గుర్తింపు రావడం కోసం, పాత్రలు ఏవొకటి చేజిక్కించుకోవడం కోసం ఏ పాత్రలు పడితే అవి ఒప్పేసుకుంటారు హీరోయిన్లు. అయితే ఒక దశ దాటాక తమకు గుర్తింపు వచ్చి పెద్ద హీరోయిన్లు అయ్యాక అప్పుడు చేసిన పాత్రలకు రిగ్రెట్ అవుతుంటారు. అనవసరంగా ఆ సినిమా చేసాం. అది నా కెరీర్ లో చేసిన పెద్ద తప్పు అంటుంటారు. షూటింగ్ జరిగినప్పుడు అది గ్రహించినా అప్పుడు తాము చిన్న వాళ్ళు కాబట్టి స్పందించలేరు. నయనతార కూడా ఇందుకు మినహాయింపు కాదు.

నయన్ ఇప్పుడు టాప్ హీరోయిన్. అటు సీనియర్ హీరోల సరసన, ఇటు యంగ్ హీరోలకు, లేడీ ఓరియెంటెడ్ పాత్రలకు నయన్ బెస్ట్ ఛాయస్ గా మారింది. అయితే ఆ మధ్య తన కెరీర్ గురించి మాట్లాడుతూ తన కెరీర్ లో గజినీ చిత్రం చేయడం అతిపెద్ద తప్పని వ్యాఖ్యానించింది. కథ నరేషన్ లో చెప్పిన విధంగా నా పాత్ర లేదు. అలాగే ఆ సినిమాలో నా లుక్ కూడా బాగోదు. అయితే నేను ఆ విషయంలో ఎవర్నీ తప్పు పట్టాలనుకోవట్లేదు. నా కెరీర్ లో తీసుకున్న అతి చెత్త నిర్ణయంగా మాత్రమే భావిస్తున్నా అని చెప్పుకొచ్చింది.

- Advertisement -

ఈ విషయంలో మురుగదాస్ వివాదంపై స్పందించాడు. తాను ఎవరికీ కావాలని పాత్రను పెంచాలని, తగ్గించాలని చూడను. ఒక్కోసారి మనకు నచ్చని వాళ్లకు కూడా పెద్ద పాత్రలు ఇవ్వాల్సి వస్తుంది. అదే సమయంలో నచ్చిన వాళ్లకు కూడా చిన్న పాత్రలే వస్తాయి. ఏదైనా కథ ప్రకారమే, ఆ కథకు ఎవరు సెట్ అవుతారు అన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. అది మా చేతుల్లో లేదు అని చెప్పుకొచ్చాడు మురుగదాస్.

అయితే మురుగదాస్, నయనతార ఇద్దరూ కూడా ఇప్పుడు దర్బార్ సినిమాలో కలిసి పనిచేయడం విశేషం. రజినీకాంత్ సరసన నటించిన నయన్ కు ఈ సినిమాలో చాలా మంచి పాత్ర పడినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఆర్కిటెక్ట్ గా నటించిన నయన్, కథలో కీలక మలుపుకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All