HomePolitical Newsఒకవైపు మునుగోడు ఉప ఎన్నిక ,ఇంకోవైపు సెప్టెంబర్ 17, మరోవైపు భారత్ జోడోయాత్ర

ఒకవైపు మునుగోడు ఉప ఎన్నిక ,ఇంకోవైపు సెప్టెంబర్ 17, మరోవైపు భారత్ జోడోయాత్ర

ఒకవైపు మునుగోడు ఉప ఎన్నిక ,ఇంకోవైపు సెప్టెంబర్ 17, మరోవైపు భారత్ జోడోయాత్ర
ఒకవైపు మునుగోడు ఉప ఎన్నిక ,ఇంకోవైపు సెప్టెంబర్ 17, మరోవైపు భారత్ జోడోయాత్ర

తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఒకవైపు మునుగోడు ఉప ఎన్నిక ,ఇంకోవైపు సెప్టెంబర్ 17, మరోవైపు భారత్ జోడోయాత్ర . బిజీ బిజీ షెడ్యూల్‌తో వ్యూహాత్మకంగా ముందకు వెళుతోంది. పార్టీ కార్యక్రమాల సన్నాహక సమావేశాలతో నిత్యం వార్తల్లో నిలిచేలా దూసుకుపోతోంది. ఉద్యమ సమయంలో అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణ గీతం..తెలంగాణ వాదులకు, విద్యార్థులకు , ఉద్యమకారులకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జయ జయహే తెలంగాణ గీతాన్ని అధికారికంగా గుర్తించలేదంటూ కాంగ్రెస్‌ ఎద్దేవా చేస్తోంది. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత జయ జయహే తెలంగాణ గీతాన్ని అధికారికంగా గుర్తిస్తామని పిసిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. మ‌రోవైపు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. దీని కోసం తెలంగాణ తల్లి విగ్రహాన్ని సరికొత్తగా తయారు చేయిస్తోంది. కొత్త రూపురేఖలతో తయారు చేయించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెప్టెంబరు 17న రాష్ట్ర ప్రజలకు పరిచయం చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఈ విగ్రహానికి సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్‌ విడుదల చేసింది. తెలంగాణ తల్లి కష్టజీవి,ఊరి సంస్కృతికి ప్రతిరూపం,మన తల్లి దొరల గడీలలో దొరసాని కాదన్నారు కాంగ్రెస్‌ నేతలు.

ఒంటి నిండా వజ్రవైడుర్యాలు పొదిగిన నగలు, నెత్తిన బంగారు కిరీటాన్ని ధరించి రాచరికానికి ప్రతిరూపంగా రాజదర్పాన్ని కలిగి ఉండటం మన తల్లి లక్షణం కానే కాదంటున్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి 75 సంవత్సరాలు పూర్తవుతోన్న సందర్భంలో ప్రతి పల్లె, ప్రతిపట్నం, ప్రతి తండా, ప్రతి గూడెం…ఊరు వాడ ఏడాది పాటు మన వారసత్వ ఘనతను చాటుదామని పిలుపునిస్తోంది తెలంగాణ కాంగ్రెస్. ఇదిలా ఉంటే.. టీపీసీసీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే టీఆర్ఎస్, బీజేపీలను పాతరపెట్టి.. గొయ్యి తీసి బొందపెట్టాలని అన్నారు.

- Advertisement -

ఎనిమిదేళ్ల పాలనలో టీఆర్‌ఎస్, బీజేపీలకు చిత్తశుద్ధి ఉంటే మునుగోడు నియోజకవర్గం సస్యశ్యామలం అయ్యేదన్నారు. ఈ రెండు పార్టీలు మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమవతున్నాయని విమర్శించారు. ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, మునుగోడు నియోజకవర్గంలో నిధుల కేటాయింపులోనూ వివక్ష చూపారని విమర్శించారు. డిండి ఎత్తిపోతల పథకానికి 5వేల కోట్లు కేటాయిస్తే ప్రతి ఎకరాకు సాగు నీళ్లు అందేవని రేవంత్ రెడ్డి అన్నారు. శివన్నగూడెం ప్రాజెక్టు నిర్వాసితులకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఇచ్చిన పరిహారమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. గజ్వేల్, సిరిసిల్ల రైతులకివ్వడానికి అక్కడ దేవుళ్లు, నల్గొండను రాక్షసులేం పాలించడం లేదు కదా అని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తేనే ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీరుతాయని చెప్పారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All