Homeరివ్యూస్`మిస్ట‌ర్ హోమానంద్` రివ్యూ!!

`మిస్ట‌ర్ హోమానంద్` రివ్యూ!!

Mr Homanand Reviewసినిమా రంగం పై విప‌రీత‌మైన పాష‌న్ ఉండ‌టంతో … న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకుని .. త‌న పేరునే టైటిల్ గా మార్చుకుని `మిస్ట‌ర్ హోమానంద్‌` చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు హోమానంద్‌. పావ‌ని హీరోయిన్ గా న‌టించ‌గా మ‌రో న‌టి ప్రియాంక శ‌ర్మ కీల‌క పాత్ర‌లో న‌టించింది. ఓం తీర్థం మేక‌ర్స్ నిర్మించిన ఈ చిత్రానికి జై రామ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డిఫ‌రెంట్ టైటిల్ తో ఆడియ‌న్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేసిన ఈ చిత్రం బోలే షావ‌లి కంపోజ్ చేసిన పాట‌ల‌తో… ట్రైల‌ర్స్ తో ప్రేక్ష‌కుల‌ను ఎట్రాక్ట్ చేసింది. ఈ చిత్రం ఈ నెల 29 న గ్రాండ్ రిలీజ్‌. ఈ సంద‌ర్భంగా ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం…

క‌థలోకి వెళితే…
తెగ పిసినారి అయిన హీరో హోమానంద్ త‌న తండ్రి సొంతింటి క‌ల నెర‌వేర్చ‌డానికి పూనుకుంటాడు. ఈ క్ర‌మంలో త‌న‌కు ఎదురైన సిల్లీ టాస్క్ గెలుచుకుని ఒక ఇంటిని కొంటాడు. తీరా చూస్తే ఆ ఇంట్లో ఒక దెయ్యం ఉంటుంది. ఆ దెయ్యానికి హీరోకు మ‌ధ్య పెద్ద ఫైట్ న‌డుస్తుంది. హీరో మంచి త‌నం తెలుసుకున్న ఆ దెయ్యం త‌న‌కో ప‌ని అప్ప చెబుతుంది. ఆ ప‌ని ఏంటి? అ స‌లు ఆ దెయ్యం క‌థేంటి? హీరో ఇల్లు కొన‌డానికి ఇండైరక్ట్ గా ఎందుకు? ఎవ‌రు? హెల్ప్ చేస్తార‌న్న‌ది ఆ స‌క్తిక‌ర‌మైన అంశం. ఇదే మిగ‌తా కథాంశం.

- Advertisement -

న‌టీన‌టుల హావ‌భావాలు
హోమానంద్ కు ఇది తొలి సినిమా అయినా….ఎంతో అనుభ‌వం ఉన్న హీరోలా త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. ముఖ్యంగా డైలాగ్స్ అల‌వోక‌గా చెబుతూ… అదిరిపోయే డాన్స్ , ఫైట్స్ తో ఇర‌గ‌దీసాడు. భ‌విష్య‌త్ లో మంచి హీరోగా రాణిస్తాడు. అలాగే పావ‌ని హోమానంద్ కి మ‌ధ్య మంచి కెమిస్ట్రీ వ‌ర్క‌వుట్ అయింది. ఇక దెయ్యం పాత్ర‌లో ప్రియాంక శ‌ర్మ అప్పుడ‌ప్పుడూ భ‌య‌పెడుతూ.. అప్ప‌టిక‌ప్పుడే న‌వ్విస్తూ ప్రేక్ష‌కుల‌కు మంచి ఎంట‌ర్ టైన్ మెంట్ అందించింది. అలాగే హీరో ఫాద‌ర్ గా సుమ‌న్, విల‌న్ పాత్ర‌లో ప్ర‌భాక‌ర్ , క‌మెడియ‌న్స్ గా అదుర్స్ ర‌ఘు, గుండు ముర‌ళి, త‌డివేలు, చిట్టిబాబు త‌మైన శైలిలో న‌టించి మెప్పించారు.

సాంకేతిక నిపుణుల ప‌నితీరు

ద‌ర్శ‌కుడు ఒక సింపుల్ లైన్ ని తీసుకుని దానికి చ‌క్క‌టి స్క్రీన్ ప్లే ని జ‌త‌కూర్చి హ‌ర్ర‌ర్ కామెడీ గా మిస్ట‌ర్ హోమానంద్ చిత్రాన్ని తెర‌కెక్కించ‌డంలో స‌క్సెస్ అయ్యాడ‌నే చెప్పాలి. ఇందులో ల‌వ్, ఫ్యామిలీ ఎమోష‌న్స్ కూడా పుష్క‌లంగా ఉన్నాయి. ముఖ్యంగా డైలాగ్స్ చాలా బాగా కుదిరాయి. హీరో చెప్పిన డైలాగ్స్ చాలా చోట్ల పేలాయి. వీటితో పాటు బోలే షావ‌లి అందించిన పాట‌లు సినిమాకు మెయిన్ ఎస్సెట్ అయితే హీరో చేసిన డాన్స్ ఆ పాట‌ల‌కు ప్రాణం పోశాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఇద్ద‌రు హీరోయిన్స్ తో వ‌చ్చే సాంగ్ థియేట‌ర్స్ లో ఆడియ‌న్స్ తో విజిల్స్ కొట్టించే విధంగా ఉంది. అలాగే సినిమాటోగ్ర‌ఫీ మ‌రో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణగా నిలిచింది. ఇలా సాంకేతిక నిపుణులంద‌రూ త‌మ వంతు పూర్తి స‌హ‌కారాన్ని అందించ‌డంతో హోమానంద్ అంద‌రికే న‌చ్చే సినిమాలా రూపొందింది. గ‌తంలో కూడా సినిమాలు నిర్మించిన అనుభ‌వం ఉండ‌టంతో ఈ క‌థ‌కు ఎంత పెట్టాలో అంత ఖ‌ర్చు పెట్టారు నిర్మాత . నిర్మాణ విలువ‌లు చాలా బావున్నాయి.

స‌మీక్ష లోకి వెళితే…
స‌రైన ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ కుద‌రితే హ‌ర్ర‌ర్ కామెడీ అనేది ఎపుడూ హిట్ ఫార్ములానే అనే విష‌యాన్నిమ‌రోమారు ఫ్రూవ్ చేసింది `మిస్ట‌ర్ హోమానంద్ చిత్రం. ఫ్యామిలీ సెంటిమెంట్, ల‌వ్, హ‌ర్ర‌ర్ , కామెడీ అంశాల‌తో ఈ చిత్రం ఆద్యంతం మెప్పిస్తుంది. బ్రెయిన్ మార్పిడి అనే అంశం కొత్త‌గున్న‌ప్ప‌టికీ దాన్ని ఇంకా డీటైల్డ్ గా చూపిస్తే బాగుండేది అనిపించింది. దెయ్యం పాత్ర‌తో కామెడీ చేయించే స్కోపున్న ఆ దిశ‌గా ద‌ర్శ‌కుడు దృష్టి సారించ‌లేద‌నిపించింది. క్లైమాక్స్ చాలా రొటీన్ గా త్వ‌ర‌గా త్వ‌ర‌గా ముగించేసిన ఫీలింగ్ వ‌చ్చింది. అద‌ర్ వైజ్ సినిమా అంతా హీరో త‌న భుజాల‌పై వ‌న్ మ్యాన్ ఆర్మీలా తీసుకెళ్లాడు. క్లాస్ , మాస్ అని కాకుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే చిత్రం మిస్ట‌ర్ హోమానంద్. సో దిస్ వీక్ డోంట్ మిస్. మ‌స్ట్ వాచ్ `మిస్ట‌ర్ హోమానంద్ .

టాప్ లైన్ – మిస్ట‌ర్ హోమానంద్ చేస్తాడు దిల్ ప‌సంద్‌
టాప్ రేటింగ్ – 3

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All