Homeటాప్ స్టోరీస్రేవంత్ రెడ్డి బీజేపీ లోకి ?

రేవంత్ రెడ్డి బీజేపీ లోకి ?

 

 MP Revanth reddy eyes on BJP ?
MP Revanth reddy eyes on BJP ?

 

- Advertisement -

తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి . ఆమేరకు ఢిల్లీ లో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది . కాంగ్రెస్ పార్టీ తరుపున మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి సంచలన విజయం సాధించాడు రేవంత్ రెడ్డి . అలాగే భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి గెలుపొందాడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి . ఇక రేవంత్ రెడ్డి తో పాటుగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ భారతీయ జనతా పార్టీలోకి జంప్ కానున్నట్లు తెలుస్తోంది .

తెలంగాణలో కేసీఆర్ ని నిలువరించాలంటే కాంగ్రెస్ పార్టీ వల్ల కాదని భావించిన రేవంత్ రెడ్డి ,కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీ వైపు చూస్తున్నట్లుగా అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు . ఆమేరకు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తో ఢిల్లీ లో చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది . భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండటం , అలాగే తెలంగాణలో 4 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించడంతో రేవంత్ రెడ్డి బీజేపీ వైపు చూస్తున్నాడట !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All