Homeటాప్ స్టోరీస్చావుదెబ్బ తిన్న భారతీయ జనతా పార్టీ

చావుదెబ్బ తిన్న భారతీయ జనతా పార్టీ

Kannada voters slams bharatiya janata partyకర్ణాటక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చావుదెబ్బ తింది . కర్ణాటకలో తాజాగా మూడు పార్లమెంట్ స్థానాలకు 2 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగగా జేడీఎస్ – కాంగ్రెస్ కూటమి ఘనవిజయం సాధించగా బిజెపి మాత్రం చావుదెబ్బ తిన్నది . కర్ణాటక ఉప ఎన్నికలు బిజెపి ని కోలుకొని దెబ్బ కొట్టాయి . ఉప ఎన్నికల తర్వాత జేడీఎస్ – కాంగ్రేస్ కూటమి కూలి పోవడం ఖాయమని మా వైపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలాగే జేడీఎస్ పార్టీ కి చెందిన కొంతమంది ఎం ఎల్ ఏ లు వస్తారని అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మేమె అంటూ బిజెపి వాళ్ళు తెగ ప్రచారం చేసారు కట్ చేస్తే కర్ణాటక ఉప ఎన్నికల్లో బిజెపి ని ఖంగుతినిపించారు ఓటర్లు .

బళ్లారి , మాండ్య , శివమొగ్గ పార్లమెంట్ స్థానాలతో పాటుగా రామనగరం , జమఖండి అసెంబ్లీ స్థానాలలో ఎన్నికలు జరిగాయి . వాటిలో జేడీఎస్ – కాంగ్రెస్ కూటమి ఘనవిజయం సాధించింది . రామనగరం లో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య అనిత పోటీ చేయగా లక్షకు పైగా మెజారిటీ తో గెలిచింది . కర్ణాటకలో దొడ్డి దారిన అధికారంలోకి రావాలని ఉత్సాహపడిన భారతీయ జనతా పార్టీకి కన్నడ ప్రజలు తగిన బుద్ది చెప్పారు .

- Advertisement -

English Title: Kannada voters slams bharatiya janata party

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All