Homeటాప్ స్టోరీస్తెలుగు వారి దెబ్బకు మట్టికరిచిన బీజేపీ

తెలుగు వారి దెబ్బకు మట్టికరిచిన బీజేపీ

Humiliating defeat to the Bharateeya janata party in Karnataka By pollsకర్ణాటక ఎన్నికల్లో తెలుగు వారి దెబ్బకు మట్టికరిచింది భారతీయ జనతా పార్టీ . కర్ణాటకలో మూడు పార్లమెంట్ స్థానాలకు , రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగగా అందులో ఒక్క శివమొగ్గ పార్లమెంట్ స్థానం ని మాత్రమే కైవసం చేసుకుంది బీజేపీ . మిగతా నాలుగు చోట్ల జేడీఎస్కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది . జేడీఎస్ – కాంగ్రెస్ కూటమి ని ప్రజలు ఆశీర్వదించడంతో కన్నడ నాట భారతీయ జనతా పార్టీ ఖంగుతింది . పార్లమెంట్ సీట్ల ని గెల్చుకోవడంతో పాటుగా అసెంబ్లీ స్థానాల్లో కూడా మేమె విజయం సాధించబోతున్నాం అంటూ బీరాలు పలికిన బీజేపీ నేతలకు ఫలితాలు చూసాక కళ్ళు బైర్లు కమ్మాయి .

కర్ణాటక రాష్ట్రంలో అందునా బెంగుళూర్ పరిసర ప్రాంతాల్లో తెలుగువాళ్లు ఎక్కువగా ఉంటారు . ఆంధ్రప్రదేశ్ కు అన్ని విధాలుగా కేంద్ర సహకారం ఉంటుందని , ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన భారతీయ జనతా పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా ని పక్కన పెట్టడమే కాకుండా తెలుగు వాళ్లని నిలువునా మోసం చేసారు . దాంతో కర్ణాటకలో గెలవాల్సిన భారతీయ జనతా పార్టీ ని తెలుగువాళ్లు మట్టికరిపించడంతో అధికారం దూరమయ్యింది , అంతేకాదు తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో కూడా తెలుగువాళ్లు బీజేపీ ని చిత్తుగా ఓడించారు , చావు దెబ్బ కొట్టారు .

- Advertisement -

English Title:  Humiliating defeat to the Bharateeya janata party in Karnataka By polls

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All