Homeటాప్ స్టోరీస్మా రాజకీయాలు అంటే పిల్ల ఆటలు అనుకుంటున్నారు.

మా రాజకీయాలు అంటే పిల్ల ఆటలు అనుకుంటున్నారు.

మా రాజకీయాలు అంటే పిల్ల ఆటలు అనుకుంటున్నారు.
మా రాజకీయాలు అంటే పిల్ల ఆటలు అనుకుంటున్నారు.

రాజకీయాల గురించి ఎమన్న వార్తలు వచ్చాయంటే చాలా మంది ఇంటరెస్ట్ గా చూస్తారు. అందులో ఎవరెవరూ ఏమనుకున్నారు? ఒకరి మీద ఒకరు మండిపడ్డారా? లేక అభిప్రాయం బేధాలు వచ్చి ఒకలిని ఒకలు తెగ తిట్టేసుకున్నారా? అని ఒక పక్క నుండి కాకుండా గొడవలని ఎన్ని పక్కల నుండి చూడాలో అన్ని పక్కల నుండి చూసేస్తారు జనాలు. మరి రాజకీయాలు అంటేనే అలానే చూడాలి కదా..

2019 లో అసలు రాజకీయాల కంటే బుల్లితెర అయిన ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) రాజకీయాలు ఎక్కువైపోయాయి. ఒక వర్గాల వారికి ఇంకొక వర్గాల వారికి అస్సలు పడట్లేదు. అధ్యక్షుడు లేకుండా ఎవరికీ వారు సమావేశాలు పెట్టేస్తున్నారు. మొదటి నుండి చెప్పాలి అంటే అప్పుడు ఎమో రాజేంద్ర ప్రసాద్ – హేమ ల మధ్య వివాదాలు తలెత్తితే ఈ సంవత్సరం నరేష్ – శివాజీ రాజాల మధ్య మేము అంటే మేము అని తెగ గొడవలు పడి ఇరు వర్గాలు వారికి దొరికిన సభ్యుల సహాయంతో బరిలోకి దిగారు.

- Advertisement -

మొత్తానికి ఆ బరిలో నరేష్ వర్గాల వారికి తెలుగు పరిశ్రమ అందరూ సహకరించి అధిక ఓట్లు వేశారు వారిని గెలిపించారు. శివాజీ రాజా గారు అప్పటి నుండి సైలెంట్ అయిపోయారు. బహుశా ఓటమిని భరించలేక ఎవరికీ కనపడకుండా ఉన్నాడు అనుకున్నారు కానీ నేను అలాంటి మనిషిని కాదు కేవలం సంబరాలు జరుపుకుంటున్న వారిని ఇబ్బంది పెట్టలేక నేను సైలెంట్ అయిపోయాను, ఒకవేళ నరేష్ ఆధ్వర్యంలో ఎమన్నా తేడా జరిగితే మేము తిరగబడతాం అని మీడియా వారి సాక్షిగా తన వ్యక్తిత్వాన్ని మరో సారి నిరూపించుకున్నారు.

ఇక నరేష్ వర్గం లో ముక్యులు ఎవరు అంటే భార్య భర్త అయిన ‘జీవిత రాజశేఖర్ – రాజశేఖర్’ ఇరువురు నరేష్ గారికి బాగా చేదోడు వాదోడుగా ఉండేవారు. అలాంటిది వారిలో వారికి ఇప్పుడు పచ్చ గడ్డి వేస్తే భగ్గున మండిపోతున్నారు. అధ్యక్షుడు అయిన నరేష్ గారికి ఎటువంటి మాట చెప్పకుండా మిగిలిన వారిని పోగేసుకొని సమావేశాలు పెట్టేసుకున్నారు. ఆదివారం జరిగిన ఒక సమావేశంలో నరేష్ వర్గాల వారికి రాజశేఖర్ వర్గాల వారికి మీది తప్పు అంటే మీది తప్పు అని ఒకరిని ఒకలు దూషించుకున్నారు. అందులో కొంతంది సమావేశం జరుగుతుండగా మధ్యలో లేచి వెళ్లిపోయారు.

అసలు సమావేశము ఎందుకు పెట్టారో? ఎవరిని ఉద్దేశించి పెట్టారో? మాకు చెప్పకుండా ఇలా చేస్తారా? అలా చేస్తారా? ఎవరు పడితే వారు అధికారాల్ని చేతులోకి తీసుకొని సమావేశాలు పెట్టేస్తారా? రాజకీయాలు అంటే చిన్న పిల్ల ఆటలు అని కూసింత చిన్న పాటి గొడవలు జరిగాయి అని చిత్ర రంగాల వారికి వార్తలు అందినట్టుగా అనిపిస్తున్నాయి. అయితే పరుచూరి గోపాల కృష్ణ గారు సమావేశం మధ్యలో కంట తడి పెట్టుకొని సమావేశం మధ్యలో వెళ్లిపోవడం, కృష్ణంరాజు తరుపున ఉన్నవారు నరేష్ గారు ఉండగా జీవిత రాజశేఖర్ గారు సమావేశాన్ని నడిపించడం లాంటి వాదనలు చూస్తుంటే ‘మా’ రాజకీయాలు అంటే పిల్ల ఆటలాగే ఉంటాయా? అని మనకి అనిపిస్తుంది కదా…..

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All