Homeటాప్ స్టోరీస్జనసేన పార్టీలో చేరతానంటున్న నరేష్

జనసేన పార్టీలో చేరతానంటున్న నరేష్

ఆంధ్రప్రదేష్ ఎన్నికల్లో జనసేన పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది , అయినప్పటికీ ఆ పార్టీలో చేరతానని అంటున్నాడు సీనియర్ నటుడు నరేష్ . ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మాత్రమే ఓటర్లకు డబ్బులు పంచకుండా పోటీ చేసాడని , దేశానికి అలాంటి నాయకుడు మాత్రమే కావాలని అందుకే నేను త్వరలోనే జనసేన పార్టీలో చేరతానని అంటున్నాడు నరేష్ .

- Advertisement -

నరేష్ ఇంతకుముందు భారతీయ జనతా పార్టీలో చేరాడు . పనిచేసాడు కూడా కానీ ఎక్కడో తేడా కొట్టింది దాంతో ఆ పార్టీ నుండి బయటకు వచ్చాడు అలాగే రాజకీయాలను కూడా వదిలేసాడు . కట్ చేస్తే ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు నరేష్ . ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కోట్లలో ఖర్చు చేస్తున్నారని , అలాంటి వాళ్ళు ప్రజాసేవ ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నాడు . పవన్ కళ్యాణ్ మాత్రమే సైనికుడిని అందుకే అతడి పార్టీలో చేరతానని అంటున్నాడు . అయితే జనసేన తరుపున పోటీ చేసిన వాళ్లలో పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోయాడు . అలాంటి పార్టీలో చేరి ఏం చేస్తాడో చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All