Homeటాప్ స్టోరీస్మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ విడుదల వాయిదా, మరో రెండు సినిమాలతో ఢీ!!

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ విడుదల వాయిదా, మరో రెండు సినిమాలతో ఢీ!!

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ విడుదల వాయిదా, మరో రెండు సినిమాలతో ఢీ!!
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ విడుదల వాయిదా, మరో రెండు సినిమాలతో ఢీ!!

అఖిల్ అక్కినేని నటించిన నాలుగో చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్. ఈ సినిమా గతేడాదే విడుదల కావాల్సి ఉన్నా, కరోనా ఇతరత్రా కారణాల వల్ల ఈ చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. చివరికి ఈ చిత్రాన్ని అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు అధికారికంగా కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. అయితే ఇప్పుడు కారణం తెలియదు కానీ మరో వారం వాయిదా పడినట్లు కన్ఫర్మేషన్ వచ్చింది.

అక్టోబర్ 8 నుండి అక్టోబర్ 15కు ఈ చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ దసరాకు వస్తుండగా మరో రెండు చిత్రాలతో పోటీ పడబోతోంది. అక్టోబర్ 14న మహా సముద్రం విడుదల కానుండగా, అక్టోబర్ 15కి వరుడు కావలెను వస్తున్నట్లు నిన్ననే ప్రకటించారు. కాగా అక్టోబర్ 8న విడుదల కానున్న కొండ పొలం చిత్రానికి కొంత రిలీఫ్ దక్కినట్లు అయింది.

- Advertisement -

బొమ్మరిల్లు భాస్కర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. గోపి సుందర్ అందించిన పాటలు ఇప్పటికే సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All