
అఖిల్ అక్కినేని హీరోగా ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం జూన్ 19న విడుదల కాబోతోంది. ఇదిలా వుంటే అఖిల్ నటిస్తున్న 5వ చిత్రం కూడా మొదలైంది. గురువారం అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా అఖిల్ 5వ సినిమా టైటిల్‌ని, ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ చిత్రానికి `ఏజెంట్` అనే టైటిల్‌ని ప్రకటించారు.
పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ మూవీ కోసం దేవుని చిత్ర పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి కింగ్ నాగార్జున క్లాప్ నివ్వగా, అమల అక్కినేని కెమెరా స్విఛాన్ చేశారు. ఈ నెల 11 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. ఇదిలా వుంటే ఫస్ట్‌లుక్‌పై, ఆ ప్రాజెక్ట్‌పై హీరో అఖిల్ అక్కినేని ట్విట్టర్‌లో స్పందించారు.
`నాలోని కొత్త వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నా.. సురేందర్‌రెడ్డి నన్ను అలా తీర్చిదిద్దారు. ఇక అధికారికంగా నేను ఆయనకి సరెండర్ అయ్యాను. మా చిత్ర నిర్మాత అనిల్ సుంకర గారికి ధన్యవాదాలు. హై టెక్నికల్ టీమ్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా వుంది. కలిసి మేజిక్ క్రియేట్ చేద్దాం` అని ట్వీట్ చేశారు అఖిల్ అక్కినేని.