Homeటాప్ స్టోరీస్వీకెండ్ బాక్స్ ఆఫీస్: బ్యాచలర్, పెళ్లి సందD హవా

వీకెండ్ బాక్స్ ఆఫీస్: బ్యాచలర్, పెళ్లి సందD హవా

most eligible bachelor and pelli sandaD dominate weekend box office 
most eligible bachelor and pelli sandaD dominate weekend box office

ఈ దసరా ఫెస్టివల్ మీద టాలీవుడ్ చాలానే ఆశలు పెట్టుకుంది. దసరాకు మూడు చిత్రాలు విడుదలయ్యాయి. అన్నిటికన్నా ఎక్కువ బజ్ ను క్రియేట్ చేసింది మహా సముద్రం. 14న విడుదలైన ఈ చిత్రం ఆశ్చర్యకరంగా ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. ఈ చిత్రానికి వస్తోన్న కలెక్షన్స్ కూడా నిరాశాజనకంగానే ఉన్నాయి.

ఇక అఖిల్ అక్కినేని నాలుగో చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ కు మిక్స్డ్ టు డీసెంట్ రివ్యూలు వచ్చాయి. ఈ చిత్ర కలెక్షన్స్ మాత్రం సూపర్ పాజిటివ్ గా ఉన్నాయి. రెండు రోజుల్లోనే 18 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది ఈ చిత్రం. తొలి హిట్ కోసం ఎదురుచూస్తోన్న అఖిల్ కు ఈ సినిమా సక్సెస్ పెద్ద ఊరట. పూజ హెగ్డే ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది.

- Advertisement -

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ కంటే కూడా పెళ్లి సందD చిత్రానికి వస్తోన్న కలెక్షన్స్ సర్ప్రైజింగ్ గా ఉన్నాయి. వరస్ట్ రివ్యూలు వచ్చాయి ఈ చిత్రానికి. క్రిటిక్స్ అయితే అవుట్ డేటెడ్ స్టోరీ అండ్ నరేషన్ అంటూ ఏకిపడేసారు. కానీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. పెళ్లి సందD వీకెండ్ లో హౌజ్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అయింది. అయితే ఈ రెండు చిత్రాలు కూడా తొలి వీక్ పూర్తయ్యేవరకూ డీసెంట్ గా పెర్ఫర్మ్ చేస్తే ప్రాఫిట్ వెంచర్స్ కిందకు వస్తాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All