Homeన్యూస్సాంగ్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ కు పెద్ద ప్లస్ కానున్నాయా?

సాంగ్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ కు పెద్ద ప్లస్ కానున్నాయా?

సాంగ్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ కు పెద్ద ప్లస్ కానున్నాయా?
సాంగ్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ కు పెద్ద ప్లస్ కానున్నాయా?

అఖిల్ అక్కినేని తన నాలుగో సినిమాతోనైనా తనకు మొదటి హిట్ వస్తుందని ఆశిస్తున్నాడు. అఖిల్ చేసిన మొదటి మూడు చిత్రాలు నిరుత్సాహపరిచిన విషయం తెల్సిందే. దీంతో నాలుగో చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ పై చాలానే ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రం పలు వాయిదాలు పడి చివరికి దసరా సందర్భంగా అక్టోబర్ 15న విడుదలకు సిద్ధమైంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ లో అఖిల్ కు జోడిగా టాప్ నటి పూజ హెగ్డే నటించింది. వీళ్లిద్దరి పెయిర్ చూడముచ్చటగా ఉంది. ఈ చిత్రంపై మొదటి నుండి మంచి అంచనాలే ఉన్నాయి. బన్నీ వాస్ ప్రొడక్షన్, అల్లు అరవింద్ సమర్పణ కావడంతో చిత్రంపై పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అయితే అన్నిటికంటే ఎక్కువగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ కు పెద్ద ప్లస్ గా నిలుస్తోంది మాత్రం పాటలే.

- Advertisement -

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ లో విడుదలైన ప్రతీ పాట కూడా చార్ట్ బస్టర్ అయింది. గుచ్చే గులాబీ, లెహరాయి, మనసా మనసా, చిట్టి అడుగు సాంగ్స్ అన్నీ కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఈ మధ్య కాలంలో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాలకు మెయిన్ కారణం పాటలే. లవ్ స్టోరీతో ఆ విషయం మరోసారి నిరూపించబడింది. మరి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ కూడా ఈ కోవలోకే చెందుతుందా? అఖిల్ ను ఊరిస్తోన్న ఆ తొలి విజయం ఈ చిత్రంతో అందుతుందా?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All