Homeగాసిప్స్మోనాల్‌కు టు డేస్‌కి అంతిచ్చారా?

మోనాల్‌కు టు డేస్‌కి అంతిచ్చారా?

మోనాల్‌కు టు డేస్‌కి అంతిచ్చారా?
మోనాల్‌కు టు డేస్‌కి అంతిచ్చారా?

బెల్లంకొండ శ్రీ‌నివాస్ హీరోగా రూపొందుతున్న చిత్రం `అల్లుడు అదుర్స్‌`. సంతోష్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కొంత విరామం త‌రువాత మ‌ళ్లీ బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బాట‌ప‌ట్టారు. ఈ మూవీలో న‌భా న‌టేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రం థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతోంది. లాక్‌డౌన్ స‌మ‌యంలో రియ‌ల్ హీరోగా మారిన సోనుసూద్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

ఫ్యామిలీ ఎమోష‌న్స్‌కి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని జోడించి ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీ‌నివాస్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌లే ఈ మూవీ కోసం ఓ పాట‌ని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్ర‌త్యేకంగా వేసిన సెట్‌లో పూర్తి చేశారు. ఈ పాట‌లో బిగ్‌బాస్ సీజ‌న్ 4 ఫేమ్ హీరోయిన్ మోనాల్ గ‌జ్జ‌ర్ ప్ర‌త్యేకంగా మెరిసింది. ఈ ప్ర‌త్యేక గీతంలో హీరో బెల్లంకొండ శ్రీ‌నివాస్, సోనుసూద్ ల‌తో క‌లిసి మోనాల్ స్టెప్పులేసింది.

- Advertisement -

ఈ పాట కోసం మోనాల్ గ‌జ్జ‌ర్ కు చిత్ర బృందం 12 ల‌క్ష‌లు రెమ్యున‌రేష‌న్ ఇచ్చార‌ట‌. కేవ‌లం రెండు రోజుల పాటు చిత్రీక‌రించిన ఈ పాట కోసం మోనాల్ కు 12 ల‌క్ష‌లు పారితోషికం ఇవ్వ‌డం గ్రేటే అంటున్నాయి ఫిల్మ్ వ‌ర్గాలు. బిగ్‌బాస్ సీజ‌న్ 4లో ముందు అభిజీత్‌తో ప్రేమాయ‌ణం మొద‌లుపెట్టి ఆ త‌రువాత అఖిల్ సర్థా‌క్‌తో క్లోజ్‌గా మూవ్ కావ‌డం తెలిసిందే. దీంతో మోనాల్ మ‌రింత‌గా పాపులారిటీని సొంతం చేసుకుంది. అంతే కాకుండా వ‌రుస ఆఫ‌ర్ల‌ని ద‌క్కించుకుంతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All