Homeటాప్ స్టోరీస్బెల్లంకొండ సంక్రాంతికే ఫిక్స‌‌య్యాడు!

బెల్లంకొండ సంక్రాంతికే ఫిక్స‌‌య్యాడు!

బెల్లంకొండ సంక్రాంతికే ఫిక్స‌‌య్యాడు!
బెల్లంకొండ సంక్రాంతికే ఫిక్స‌‌య్యాడు!

త‌మిళ హిట్ చిత్రం `రాక్ష‌స‌న్‌` రీమేక్‌తో సూప‌ర్‌హిట్‌ని త‌న ఖాతాలో వేసుకున్నారు యంగ్ హీరో బెల్లంకొండ శ్రీ‌నివాస్‌. స‌క్సెస్ త‌రువాత రెట్టించిన‌ ఉత్సాహంతో వున్న ఈ యంగ్ హీరో ప్ర‌స్తుతం ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `అల్లుడు అదుర్స్‌` చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. సంతోష్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌‌క‌త్వం వ‌హిస్తున్నారు. న‌భా న‌టేష్‌, అను ఇమ్మాన్యుయేట్ హీరోయిన్ లుగా న‌టిస్తున్నారు. సుమంత్ మూవీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ని సుబ్ర‌హ్మ‌ణ్యం గొర్రెల నిర్మిస్తున్నారు.

ఈ మూవీ షూటింగ్ చివ‌రి ద‌శ‌లో వుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 15న విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఫెస్టివ‌ల్ స‌మ‌యంలో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ల‌కి ప్రేక్ష‌కుల‌కు అధిక ప్రాధాన్య‌త‌నిస్తుంటారు. కాబ‌ట్టి ఈ సంక్రాంతికి `అల్లుడు అదుర్స్` బెస్ట్ ఛాయిస్ అని చిత్ర బృందం చెబుతోంది.

- Advertisement -

ఇందులో సోనూసూద్‌, ప్ర‌కాష్ రాజ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. వీరిపై వ‌చ్చే స‌న్నివేశాలు హైలైట్‌గా ఇల‌నుస్తాయ‌ట‌. `కందిరీగ‌`లో సోనూసూద్‌తో కామెడీ చేయించిన సంతోష్ శ్రీ‌నివాస్ ఈ చిత్రంలోనూ సోనూ పాత్ర‌ను మ‌రింత కొత్త‌గా మ‌లిచార‌ట‌. రాక్‌స్టార్ దేవిశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి చోట కె. నాయుడు ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు. ప‌క్యా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ మూవీతో సంక్రాంతికి బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఆడియ‌న్స్‌ని ఆక‌ట్టుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All