
టాలీవుడ్‌లో మనకు ఉన్న యువ హీరోలలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌కు గొప్ప వ్యక్తిత్వం ఉంది. అతను ఇప్పుడు అత్యంత స్టైలిష్ హీరోగా కనిపించడానికి ట్రై చేస్తున్నారు. కెరీర్ ప్రారంభంలో స్టైలిష్ ఫొటో షూట్‌లకి ప్రాధాన్యత ఇవ్వని బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త పంథాలో ఫొటో షూట్‌లకు శ్రీకారం చూట్టారు. తాజాగా ఆయన చేస్తున్న కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫొటో షూట్‌లు ఇండస్ట్రీ వర్గాలని ఆకట్టుకుంటున్నాయి.
విభిన్న రూపాల్లో, విభిన్న కాస్ట్యూమ్స్‌లో కొత్తగా కనిపించడానికి ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందు కోసం గతం కంటే పూర్తి భిన్నంగా బెల్లాంకొండ శ్రీనివాస్ నిరంతరం ఫోటో షూట్లలో పాల్గొంటున్నారు. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మొదటిసారిగా కాన్సెప్ట్ ఫోటో షూట్ చేసాడు. ఇది ఒక రకంగా అసాధారణమైనది భిన్నమైనది కూడా.
తాజా ఫొటో షూట్‌లో బారు గడ్డం.. బ్లాక్ రౌండ్ షేప్ గాగుల్స్ పూల సూట్ ధరించి బెల్లంకొండ ఈ ఫోటో షూట్ లో మెరిసిపోయారు. ఫస్ట్ లుక్‌లోనే పూర్తిగా భిన్నమైన బెల్లాంకొండను చూసినట్టుగా కనిపిస్తోంది. కాన్సెప్ట్ ఫొటో షూట్స్ పరంగా ఇదొక మంచి ప్రయత్నంగా అంతా చెబుతున్నారు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ `అల్లుడు అదుర్స్` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ దశలో వుంది.