Homeటాప్ స్టోరీస్`అల్లుడు అదుర్స్‌` మ‌ళ్లీ రీషూట్ చేయాల్సిందేనట‌?

`అల్లుడు అదుర్స్‌` మ‌ళ్లీ రీషూట్ చేయాల్సిందేనట‌?

`అల్లుడు అదుర్స్‌` మ‌ళ్లీ రీషూట్ చేయాల్సిందేనట‌?
`అల్లుడు అదుర్స్‌` మ‌ళ్లీ రీషూట్ చేయాల్సిందేనట‌?

త‌మిళ హిట్ చిత్రం `రాక్ష‌స‌న్‌` ఆధారంగా రీమేక్ అయిన చిత్రం `రాక్ష‌సుడు`. సైకో థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం హీరో బెల్లంకొండ శ్రీ‌నివాస్‌కు సూప‌ర్‌హిట్‌ని అందించింది. ఈ మూవీ త‌రువాత బెల్లంకొండ శ్రీ‌నివాస్ హీరోగా న‌టిస్తున్న చిత్రం `అల్లుడు అదుర్స్‌`. సంతోష్ శ్రీ‌నివాస్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. న‌భా న‌టేష్‌, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

మేలో చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. అయితే క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఈ ప్లాన్ మొత్తం మారిపోయింది. లాక్‌డౌన్ బిఫోర్ ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్త‌యింది. లాక్ డౌన్ స‌మ‌యంలో నే ఈ మూవీ ఎడిటింగ్ ప‌నులు దాదాపుగా పూర్తి చేయాల‌నుకున్నారు. ఆ స‌మ‌యంలోనే కీల‌క స‌న్నివేశాల‌ని మార్చితే బాగుంటుంద‌ని ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీ‌నివాస్‌, హీరో బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌.

- Advertisement -

త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభించి కీల‌క ఘ‌ట్టాల‌ని రీ షూట్ చేయబోతున్నార‌ని తెలిసింది. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్ర‌కాష్ రాజ్, సొనుసూద్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సుమంత్ మూవీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై నూత‌న నిర్మాత సుబ్ర‌హ్మ‌ణ్యం గొర్రెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All