HomeVideosవైర‌ల్ అవుతున్న మోనాల్ గ‌జ్జ‌ర్ పాట‌!

వైర‌ల్ అవుతున్న మోనాల్ గ‌జ్జ‌ర్ పాట‌!

వైర‌ల్ అవుతున్న మోనాల్ గ‌జ్జ‌ర్ పాట‌!
వైర‌ల్ అవుతున్న మోనాల్ గ‌జ్జ‌ర్ పాట‌!

బిగ్‌బాస్ సీజ‌న్ 4తో మ‌ళ్లీ వెలుగులోకి వ‌చ్చింది మోనాల్ గ‌జ్జ‌ర్‌. టాప్ 5కి ముందే హౌస్ నుంచి బ‌య‌టిరి వ‌చ్చేసిన మోనాల్ పై ప్ర‌స్తుతం వ‌రుస ఆఫ‌ర్ల వ‌ర్షం కురుస్తోంది. కొంత కాలంగా పాటు సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌చ్చిన మోనాల్ బిగ్‌బాస్ సీజ‌న్ 4తో మ‌రోసారి లైమ్ లైట్‌లోకి వ‌చ్చేసింది. రావ‌డం రావ‌డ‌మే బెల్లంకొండ శ్రీ‌నివాస్ న‌టిస్తున్న `అల్లుడు అదుర్స్‌` చిత్రంలో స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించే అవ‌కాశాన్ని ద‌క్కించుకుంది.

టీవీ షోల‌ల్లో న్యాయ‌నిర్ణేత‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. బాలీవుడ్‌లోనూ క్రేజీ ఆఫ‌ర్ల‌ని ద‌క్కించుకుంటోంది. మోనాల్ గ‌జ్జ‌ర్ `మీర్జాపూర్‌` ఫేమ్ పంక‌జ్ త్రిపాఠీ క‌లిసి న‌టించిన హిందీ చిత్రం `కాగ‌జ్‌`. స‌తీష్ కౌశిక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స‌ల్మాన్‌ఖాన్‌, నిశాంత్ కౌశిక్‌, వికాస్ మాలు నిర్మించిన ఈ చిత్రంలోని `బైల్ గాడీ…` సాంగ్ సోష‌ల్ మీడియాతో పాటు యూట్యూబ్‌లో వైర‌ల్‌గా మారింది.

- Advertisement -

ప్ర‌వేశ్ మ‌ల్లిక్ సంగీతం అందించిన ఈ పాట‌ని ఉదిత్ నారాయ‌ణ్‌, అల్కా యాగ్నిక్ ఆల‌పించారు. బ్ర‌తికుండ‌గానే చ‌నిపోయిన‌ట్టు స‌ర్టిఫికెట్ ఇచ్చిన లంచ‌గొండి వ్య‌వ‌స్థ‌పై ఓ సామాన్యుడు లాల్‌బిహారీ 18 ఏళ్ల పాటు చేసిన పోరాటం నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని అజంఘ‌ర్ కు చెందిన లాల్ బిహారీ అనే రైతు క‌థ నేప‌థ్యంలో రూపొందిన చిత్ర‌మిది. వాస్త‌విక కోణంలో తెర‌కెక్కిన ఈ చిత్రం జీ5 ఓటీటీలో ఈ నెల 7న స్ట్రీమింగ్ కాబోతోంది.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All