Homeటాప్ స్టోరీస్ల‌వ‌ర్స్‌డేన షాకిచ్చిన బిగ్‌బాస్ ల‌వ్ బ‌ర్డ్స్‌!

ల‌వ‌ర్స్‌డేన షాకిచ్చిన బిగ్‌బాస్ ల‌వ్ బ‌ర్డ్స్‌!

ల‌వ‌ర్స్‌డేన షాకిచ్చిన బిగ్‌బాస్ ల‌వ్ బ‌ర్డ్స్‌!
ల‌వ‌ర్స్‌డేన షాకిచ్చిన బిగ్‌బాస్ ల‌వ్ బ‌ర్డ్స్‌!

బిగ్‌బాస్ సీజ‌న్ 4 ఇటీవ‌లే ముగిసింది. `లైఫ్‌ ఈజ్ బ్యూటిఫుల్` ఫేమ్ అభిజీత్ ఈ సీజ‌న్‌కి విజేత‌గా నిలిచాడు. ఈ షోకు ప్రారంభ ద‌శ‌లో కంటెస్టెంట్‌ల ప‌రంగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తిన విష‌యం తెలిసిందే. అన్నౌన్ ఫేస్‌ల‌ని ఈ షోకు తీసుకున్నార‌ని చాలా మంది సోష‌ల్ మీడియా వేదిక‌గా `స్టార్ మా`తో పాటు బిగ్‌బాస్ షో నిర్వాహ‌కుల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే ఈ ఆ తరువాతే ఈ షోకు పాపులారిటీ పెర‌గ‌డం మొద‌లైంది.

దానికి ప్ర‌ధాన కార‌ణం అభిజీత్‌, మోనాల్‌, అఖిల్ సర్త‌క్‌ల ముక్కోణ ప్రేమాయ‌ణం. అభిజీత్ కాద‌న‌డంతో మోనాల్ … టీవీ న‌టుడు అఖిల్ స‌ర్త‌క్‌తో ల‌వ్‌ట్రాక్‌ని ప్రారంభించింది. వీరి కార‌ణంగా గొడ‌వ‌లు.. అల‌క‌లు.. గిల్లిక‌జ్జాల‌తో హౌస్‌లో ఓ రేంజ్‌లో ఎంట‌ర్‌టైన్‌మెంట్ జ‌న‌రేట్ అయ్యింది. ఆ త‌రువాత మోనాల్, అఖిల్ ల ప్రేమాయ‌ణానికి అడ్డు లేకుండా పోయింది. బ‌య‌టికి వ‌చ్చినా వీరి అదే ల‌వ్‌ట్రాక్‌ని కంటిన్యూ చేస్తున్నారు. ఇదిలా వుంటే వీరిద్ద‌రిని హీరోహీరోయిన్‌లుగా పెట్టి `తెలుగు అబ్బాయి గుజ‌రాత్ అమ్మాయి` పేరుతో ఓ సిరీస్‌ని రూపొందిస్తున్నారు.

- Advertisement -

ఈ చిత్రానికి భాస్క‌ర్ బంటుప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. స‌ర‌స్వ‌తీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సరస్వతీ క్రియేషన్స్ బ్యానర్లో మాస్టర్ అజితేష్ వెంకట్ సమర్పణలో రూపొందుతోన్నఈ వెబ్ సిరీస్ ని ఏ భాస్క‌ర‌రావు నిర్మిస్తున్నారు. మార్చి రెండ‌వ వారం నుంచి ఈ వెబ్ సిరీస్ చిత్రీక‌ర‌ణ ప్రారంభం కాబోతోంది. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ వెబ్ డ్రామాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌ని మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by M Monal Gajjar (@monal_gajjar)

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All