Homeటాప్ స్టోరీస్క‌రోనా ఎఫెక్ట్ : స‌తీమ‌ణి సేవ‌లో భ‌క్త‌వ‌త్స‌లంనాయుడు!

క‌రోనా ఎఫెక్ట్ : స‌తీమ‌ణి సేవ‌లో భ‌క్త‌వ‌త్స‌లంనాయుడు!

Mohan babu MyQuarantine time video goes viral
Mohan babu MyQuarantine time video goes viral

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మోహ‌న్‌బాబు ఓ టెర్ర‌ర్‌. ఆయ‌నని వేలెత్తి చూపించాలంటే అది సాహ‌స‌మే. తెర‌పై, తెర వెనుక ఆయ‌న చాలా స్ట్రీక్ట్‌గా వ్య‌వ‌హ‌రిస‌తుంటారు. అలాంటి ఆయ‌న త‌న స‌తీమ‌ణి సేవ‌లో త‌రిస్తే ఎలా వుంటుంది. సెట్‌లో, వెండితెర‌పై పులిలా గాంభీర్యాన్ని ప్ర‌ద‌ర్శించే ఆయ‌న త‌న భార్య నిర్మ‌లా దేవికి సేవ చేస్తే ఎలా వుంటుంది?.. దీనికి సంబంధించ‌న ఓ ఫ‌న్నీ వీడియోని హీరో మంచు మ‌నోజ్ సోష‌ల్ మీడియా ఇన్ స్టాలో షేర్ చేశారు.

ఈ వీడియోలో ..త‌న భార్య నిర్మల సోఫాలో ప‌డుకుని కునుకుతీస్తుంటే క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు చేతిలో వైట్ రుమాలు ప‌ట్టుకుని విస‌న‌క‌ర్ర‌లా ఊపుతున్న దృశ్యం ఆక‌ట్టుకుంటోంది. క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న విష‌యం తెలిసిందే. దేశంలో ఇప్ప‌టికే లాక్ డైన్‌ని విధించారు. ఎక్క‌డి వారు అక్క‌డే వుండాల‌ని, ఇళ్ల‌ల్లోనే వుండాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం తోపాటు రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

దీంతో అంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. మోహ‌న్‌బాబు కూడా షూటింగ్‌లు బంద్ చేసి ఇంటికే ప‌రిమితం అయిపోయి త‌న భార్య‌కు సేవ చేస్తుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ వీడియోపై మంచు మ‌నోజ్ ఓ పోస్ట్‌ని కూడా పెట్టారు. డియ‌ర్ మెన్. మీకు అత్యంత ఇష్ట‌మైన వారికి తిరిగి సేవ చేయాల్సిన స‌మ‌య‌మిది. మీ క్వారెంటైన్ కు సంబంధించిన వీడియోని తీసి MyQuarantine time అనే హ్యాష్ ట్యాగ్‌తో షేర్ చేయండి` అని పోస్ట్ చేశారు. ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All