
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని జనం భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు. దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్య మంత్రుల వరకు కరోనా భారన పడకుండా ప్రజలు అప్పమత్తంగా వుండాలని సూచనలు చేస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇదిలా వుంటే ఫిల్మ్ స్టార్స్ చాలా వరకు షూటింగ్‌లని అవాయిడ్ చేస్తున్నారు. తమ క్రేజీ ప్రాజెక్ట్‌ల షూటింగ్‌లని రద్దు చేసుకుంటున్నారు కూడా.
తాజాగా మోహన్‌బాబు, రామ్‌చరణ్ తమ పుట్టిన రోజు వేడుకల్ని రద్దు చేసుకున్నారు. ఇదిలా వుంటే కరోనాకు భయపడకుండా రకుల్ ప్రీత్‌సింగ్ షూటింగ్‌లో పాల్గొంటోంది. రకుల్ ప్రీత్‌సింగ్ ప్రస్తుతం కమల్‌హాసన్ హీరోగా శంకర్ రూపొందిస్తున్న `ఇండియన్ 2` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. సెట్‌లో క్రేన్ విరిగి పడటంతో షూటింగ్‌ని నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర షూటింగ్‌ని ప్రారంభించారు. రకుల్ ప్రీత్‌సింగ్ షూటింగ్‌లో పాల్గొంటోంది.
సెట్‌లో మాస్కులు ధరించి చేతిలో సానిటైజర్ బాటిల్స్‌తో యూనిట్ సభ్యులతో కలిసి ఫొటోలకు పోజిచ్చింది. ఆ ఫొటోలని సోషల్ మీడియా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. `అవసరం వుంటే కానీ బయట కాలు పెట్టకండి. షూటింగ్ క్యాన్సిల్ చేయలేదు. టీమ్ అంతా తగు జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చేస్తున్నాం. పాజిటివ్‌గా ఆలోచించండి.. కరోనాకు భయపడకండి నవ్వుతూనే ఫైట్ చేయండి` అని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది రకుల్. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Credit: Instagram