Homeటాప్ స్టోరీస్మంచు లక్ష్మి ని కూడా వేధించారట

మంచు లక్ష్మి ని కూడా వేధించారట

#metoo :says manchu lakshmiనాకు కూడా వేధింపులు తప్పలేదని , అయితే స్వయంగా కాకుండా ఫోన్ లో వేధించారని బాంబ్ పేల్చింది మంచు లక్ష్మి . మోహన్ బాబు కూతురు గా మంచు లక్ష్మి అంటే అందరికి హడల్ అయినప్పటికీ ఆమెకు కూడా వేధింపులు తప్పలేదట కాకపోతే ఆ వేధించిన వాళ్ళు సినిమారంగం లోని వాళ్ళు కాదంట లేకపోతే ఈపాటికే వాళ్ళ సంగతి అటో ఇటో తేలిపోయేది మంచు కుటుంబం చేతిలో . దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే . అందులో భాగంగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది మంచు లక్ష్మి .

మహిళల పట్ల లైంగిక వేధింపులు ఎక్కడైనా తప్పడం లేదని , నాకు సైతం వేధింపులు తప్పలేదని కాకపోతే సినిమారంగం లోని వాళ్ళు మాత్రం నన్ను వేధించలేదని , ఫోన్ లో నాకు ఎక్కువగా వేధింపులు వచ్చేవని తెలిపింది . అయితే మంచు లక్ష్మి ని ఫోన్ లో వేధించిన వాళ్ళు ఎవరు ? ఎందుకు వేధించారు అన్నది మాత్రం రివీల్ చేయలేదు . లైంగిక వేధింపుల విషయంలో మహిళలు ముందుకు వచ్చి మాట్లాడటం సంతోషకర విషయమని , ఈ ఉద్యమం ఇలాగే కొనసాగితే వేధింపులు తగ్గడం ఖాయమని అంటోంది మంచు లక్ష్మి .

- Advertisement -

English Title: #metoo :says manchu lakshmi

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All