Homeటాప్ స్టోరీస్ఆ ఇద్దరూ గొడవ మరింత పెద్దది చేసేలా ఉన్నారు

ఆ ఇద్దరూ గొడవ మరింత పెద్దది చేసేలా ఉన్నారు

#Metoo : Ambarish meeting fail between arjun and shruti hariharan మీటూ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది . ఇప్పటికే పలువురు మహిళలు పలువురిపై లైంగిక ఆరోపణలు చేయగా అందరికంటే ఎక్కువ సంచలనం సృష్టిస్తూ హీరో అర్జున్ పై లైంగిక ఆరోపణలు చేసింది హీరోయిన్ శృతి హరిహరన్ . అయితే వాళ్ళిద్దరి మద్య గొడవ పెద్దది కాకముందే రాజీ చేయాలనీ కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ ప్రయత్నించాడు . అందుకు హీరో అర్జున్ ని అలాగే హీరోయిన్ శృతి హరిహరన్ ని పిలిపించాడు . అయితే ఇద్దరి మద్య రాజీ కోసం ఒకరికొకరు క్షమాపణ చెప్పుకోండి అని సలహా ఇచ్చాడు అంబరీష్ అయితే దానికి ఇద్దరు కూడా ససేమిరా అన్నారు . దాంతో సమస్య మరింత జటిలం అయ్యింది .

నేను తప్పు చేయలేదు కాబట్టి సారీ చెప్పను అంతేకాదు న్యాయం కోసం కోర్టుని ఆశ్రయిస్తాను , శృతి హరిహరన్ కు తగిన బుద్ది చెబుతాను అంటూ ఆవేశంతో అంటున్నాడు అర్జున్ . ఇక శృతి హరిహరన్ కూడా తక్కువేమీ తినలేదు నేను నా ఆరోపణలకు కట్టుబడి ఉన్నాను , ఎలాంటి సవాళ్ళ నైనా ఎదుర్కోవడానికి నేను సిద్దం . తప్పు చేసింది ఒకరైతే నేనెందుకు సారీ చెప్పాలి , ఎందుకు రాజీ పడాలి అంటూ ఎదురు ప్రశ్న వేస్తోంది . సీనియర్ నటుడిగా రాజీ చేయాలనీ ప్రయత్నించి విఫలం కావడంతో అంబరీష్ అసంతృప్తి వ్యక్తం చేసాడు . రాజీ కోసం ప్రయత్నించాను కానీ ఇద్దరూ పంతానికి పోతున్నారు అంటూ తన అశక్తతని వ్యక్తం చేసాడు . ఇద్దరు కూడా రాజీపడేది లేదని కుండబద్దలు కొట్టడంతో ఈ మీటూ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి .

- Advertisement -

English Title : #Metoo : Ambarish meeting fail between arjun and shruti hariharan

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All