Homeటాప్ స్టోరీస్అర్జున్ ఫ్యాన్స్ శృతిని చంపుతామంటున్నారట

అర్జున్ ఫ్యాన్స్ శృతిని చంపుతామంటున్నారట

Life threats from arjun fans says sruthi hariharanహీరో అర్జున్ ఫ్యాన్స్ నన్ను చంపుతామని బెదిరిస్తున్నారని , అర్జున్ పై లైంగిక ఆరోపణలు చేసిన తర్వాత ఈ వార్నింగ్ లు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది హీరోయిన్ శృతి హరిహరన్ . హీరో అర్జున్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని శృతి ఆరోపించిన విషయం తెలిసిందే . దానికి అర్జున్ తో పాటుగా అర్జున్ కూతురు కూడా ఆ ఆరోపణలు ఖండించింది . అంతేకాదు అర్జున్ ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అన్నాడు కూడా . కట్ చేస్తే మరోసారి తన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని అంటూనే మరిన్ని విషయాలు వెల్లడించింది శృతి హరిహరన్ .

షూటింగ్ గ్యాప్ లో తనని కారవాన్ వ్యాన్ లోకి రమ్మని అర్జున్ పిలిచే వాడని , అంతేకాకుండా రాత్రి పూట విందు వినోదాలకు రమ్మని బలవంతం చేసేవాడని అవన్నీ ఓపికగా భరించానని అయితే ఇప్పుడు చెప్పడం తప్పా ? అని ఎదురు ప్రశ్న వేస్తోంది శృతి . అప్పట్లో అర్జున్ ని ఎదిరించే ధైర్యం లేదు కాబట్టే సైలెంట్ గా ఉండిపోయాను తప్ప మరో కారణం కాదని , ఇప్పుడు చెబితే తప్పని ఎలా అంటారని ప్రశ్నిస్తోంది . ఇప్పుడు భయపడేది లేదని , నన్ను భయపెట్టడానికి అర్జున్ ఫ్యాన్స్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేసింది శృతి హరిహరన్ .

- Advertisement -

English Title: Life threats from arjun fans says sruthi hariharan

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All