Homeటాప్ స్టోరీస్లైంగిక ఆరోపణలపై స్పందించిన అర్జున్

లైంగిక ఆరోపణలపై స్పందించిన అర్జున్

హీరో అర్జున్ పై లైంగిక ఆరోపణలు
హీరో అర్జున్ పై లైంగిక ఆరోపణలు

నన్ను గట్టిగా కౌగిలించుకొని పిరుదుల మీద చెయ్యి వేసి నొక్కాడని హీరో అర్జున్ పై సంచలన ఆరోపణలు చేసింది హీరోయిన్ శృతి హరిహరన్ . కాగా ఆ భామ చేసిన ఆరోపణలు అన్నీ అవాస్తవమని , కావాలనే మీటూ పేరుతో ఏదో కుట్ర జరుగుతోందని దాన్ని ఎదుర్కొంటానని లైంగిక ఆరోపణలను ఖండించాడు అర్జున్ . అసలు శృతి హరిహరన్ తో నేను ఒక్క సినిమాలో మాత్రమే నటించానని ,ఆ సమయంలో ఎప్పుడు కూడా శృతి తో ఏకాంతంగా కలిసింది లేదని ……. ఆమె ఎందుకు తప్పుడు ఆరోపణలు చేస్తుందో తెలియడం లేదని అయినా మీటూ ఉద్యమం పక్కదారి పడుతోందని సంచలన వ్యాఖ్యలు చేసాడు అర్జున్ .

తెలుగు , తమిళ చిత్రాల్లో స్టార్ హీరోగా వెలుగు వెలిగిన అర్జున్ పై శృతి హరిహరన్ లైంగిక ఆరోపణలు చేయడంతో అర్జున్ ఫ్యాన్స్ ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు . తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తమిళ మీడియాతో మాట్లాడిన అర్జున్ మీటూ ఉద్యమం ముసుగులో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని , దాని వల్ల ఉద్యమం దెబ్బ తింటుందని వాపోయాడు . శృతి హరిహరన్ ఆరోపించడం , అర్జున్ ఖండించడం జరిగింది . మరి శృతి హరిహరన్ ఈ ఖండన పై ఎలా స్పందిస్తుందో చూడాలి .

- Advertisement -

English Title: Arjun responds on sruthi hariharan allegations

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All