Homeటాప్ స్టోరీస్మెహ‌రీన్ నిశ్చితార్థం జ‌రిగిందోచ్‌!

మెహ‌రీన్ నిశ్చితార్థం జ‌రిగిందోచ్‌!

మెహ‌రీన్ నిశ్చితార్థం జ‌రిగిందోచ్‌!
మెహ‌రీన్ నిశ్చితార్థం జ‌రిగిందోచ్‌!

తెలుగు, త‌మిళ భాష‌ల్లో హీరోయిన్‌గా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న అందాల సోయ‌గం మెహ‌రీన్‌. అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన `ఎఫ్‌2`లో హ‌నీ ఈజ్ ద బెస్ట్ అంటూ న‌త‌దైన మేన‌రిజ‌మ్‌తో అంద‌రినీ ఆక‌ట్టుకున్న మెహ‌రీన్ త్వ‌ర‌లో పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. హ‌ర్యానాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ త‌న‌యుడు, మువ రాజ‌కీయ నేత భ‌వ్య బిష్ణోయ్‌ని మెహ‌రీన్ పెళ్లాడ‌బోతోంది.

ఇందుకు సంబంధించిన గ‌త కొన్ని రోజులుగా మెహ‌రీన్ ఫ్యామిలీ భ‌వ్య బిష్ణోయ్ ఫ్యామిలీ మంత‌నాలు జ‌రుపుతున్నారు. ఫైన‌ల్‌గా వీరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్ద‌లు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఈ నెల 12న శుక్ర‌వారం వీరి నిశ్చితార్థాన్ని జైపూర్‌లోని ఓ కోట‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఇందుకు సంబంధించిన ఫొటోల్ని మెహ‌రీన్ ఇన్ స్టా స్టోరీస్‌లో పంచుకుంది.

- Advertisement -

ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట సంద‌డి చేస్తున్నాయి. మెహ‌రీన్‌కు కాబోయే వ‌రుడు హ‌ర్యానా మాజీ ముఖ్య‌మంత్రి భ‌జ‌న్ లాల్‌కి స్వ‌యానా మ‌న‌వ‌డు కావ‌డం విశేషం. ప్ర‌స్తుతం మెహ‌రీన్ `ఎఫ్‌3` చిత్రంలో న‌టిస్తోంది. అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో విక్ట‌రీ వెంక‌టేష్‌, త‌మ‌న్నా, వ‌రుణ్‌తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All