Homeటాప్ స్టోరీస్మెహ‌రీన్ సినిమాల‌కు గుడ్‌బై చెబుతుందా?

మెహ‌రీన్ సినిమాల‌కు గుడ్‌బై చెబుతుందా?

మెహ‌రీన్ సినిమాల‌కు గుడ్‌బై చెబుతుందా?
మెహ‌రీన్ సినిమాల‌కు గుడ్‌బై చెబుతుందా?

టాలీవుడ్‌లో గ‌త కొన్ని నెల‌లుగా వ‌రుస‌గా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. గ‌తంలో పెళ్లంటే నో కామెంట్ అన్న తార‌లు క‌రోనా పుణ్య‌మా అని వ‌రుసగా పెళ్లికి సై అంటూ షాకిస్తున్నారు. టాలీవుడ్ సెల‌బ్రిటీల వెడ్డింగ్స్ హంగామా దిల్ రాజు రెండో పెళ్లితో మొద‌లైంది. ఇప్ప‌టికీ నాన్ స్టాప్‌గా కొన‌సాగుతూనే వుంది. ఇటీవ‌ల కాజ‌ల్‌.. రీసెంట్‌గా సుమంత్ అశ్విన్ వివాహాలు చేసుకున్నారు.

తాజాగా ఈ జాబితాలో మ‌రో హీరోయిన్ మెహ‌రీన్ కూడా చేర‌బోతోంది. హ‌ర్యానాకు చెందిన యువ రాజ‌కీయ నేత, కాంగ్రెస్ ఎంపీ త‌న‌యుడు భ‌వ్య బిష్ణోయ్‌ని మెహ‌రీన్ వివాహం చేసుకోబోతోంది. మార్యి 12న వీరి నిశ్చితార్థం జ‌ర‌గ‌బోతోంది. ఈ పెళ్లిని మెహ‌రీన్ మ‌ద‌ర్ ఫిక్స్ చేసిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే మెహ‌రీన్ త‌న అభిమానుల‌కు షాకివ్వ‌బోతున్న‌ప‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నారు.

- Advertisement -

భ‌వ్య బిష్ణోయ్ ని త్వ‌ర‌లో వివాహం చేసుకోనున్న మెహ‌రీన్ పెళ్లి త‌రువాత త‌న కెరీర్‌కి ఫుల్ స్టాప్ పెట్ట‌బోతోంద‌ని, ఇక‌పై ఆమె సినిమాల్లో న‌టించ‌ద‌ని ప‌లు వార్త‌లు షికారు చేస్తున్నాయి. ప్ర‌స్తుతం మెహ‌రీన్ `ఎఫ్‌3` చిత్రంలో న‌టిస్తోంది. `ఎఫ్‌2`కు సీక్వెల్‌గా రూపొందుఏతున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌లే మొద‌లైంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All