Homeటాప్ స్టోరీస్ఊటీకు వెళుతోన్న మెగాస్టార్

ఊటీకు వెళుతోన్న మెగాస్టార్

ఊటీకు వెళుతోన్న మెగాస్టార్
ఊటీకు వెళుతోన్న మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి వరసగా ప్రాజెక్ట్స్ ను సెట్ చేసుకున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఆచార్య చిత్రాన్ని దాదాపుగా పూర్తి చేసాడు చిరంజీవి. ఇంకా ఒక్క పాట చిత్రీకరణలో పాల్గొనాలి. మరోవైపు గాడ్ ఫాదర్ షూటింగ్ కూడా మొదలుపెట్టాడు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫెర్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతోంది. మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

నిజానికి గాడ్ ఫాదర్ నెక్స్ట్ షెడ్యూల్ మొదలవ్వడానికి ఇంకా సమయముంది కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ క్యాన్సిల్ అవ్వడంతో గాడ్ ఫాదర్ షెడ్యూల్ ను ప్రీపోన్ చేసారు. రేపటి నుండి గాడ్ ఫాదర్ ఊటీ షెడ్యూల్ మొదలవుతోంది. ఈ షెడ్యూల్ నెలాఖరు దాకా ఉంటుంది. కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారు.

- Advertisement -

ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ మెగాస్టార్ కు చెల్లెలి పాత్రను పోషిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All