Homeటాప్ స్టోరీస్ఇలాంటి హేయమైన సంఘటనలు మళ్ళీ జరగకూడదు - చిరంజీవి

ఇలాంటి హేయమైన సంఘటనలు మళ్ళీ జరగకూడదు – చిరంజీవి

chiranjeevi responds on justice for chaitra
chiranjeevi responds on justice for chaitra

ఆరేళ్ళ చిన్నారి చైత్రపై అకృత్యం చేసి ఆమె మరణానికి కారణమైన రాక్షసుడు పి. రాజు స్టేషన్ ఘన్ పూర్ రైల్వే ట్రాక్ పై శవమై కనిపించిన విషయం తెల్సిందే. ఇన్నాళ్ల నుండి తప్పించుకుని తిరుగుతున్న ఈ నరరూపరాక్షసుడు తనని తానే అంతమొందించుకున్నాడు. ఈ ఘటనపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.

“అభంశుభం తెలియని ఆరేళ్ళ చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కిరాతకుడు రాజు తనకు తానే శిక్షించుకోవడం బాధిత కుటుంబంతో సహా అందరికీ కొంత ఊరట కలిగిస్తుంది. ఈ ఘటనపై మీడియా, పౌరసమాజం చొరవ చూపాలి. అటువంటి కార్యక్రమం ఎవరు చేపట్టినా వారికి నా సహకారం ఉంటుంది. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలి” అని చిరంజీవి ట్వీట్ చేసాడు.

- Advertisement -

ఇప్పటికే మంచు మనోజ్, పవన్ కళ్యాణ్ విడివిడిగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పిన విషయం తెల్సిందే. అయితే ఈ కేసుకు ఇలాంటి ముగింపు వచ్చిందని సంతోషించడమే కాకుండా ఇలాంటి సంఘటనలు మరెక్కడా పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All