
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య పనులను పూర్తి చేసుకుని ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రంపై ఫోకస్ పెట్టాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫెర్ ను తెలుగులో రీమేక్ చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ రీమేక్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ సాగుతోంది.
ఈ చిత్రంలో నయనతార కీలక పాత్రలో నటిస్తోంది. ఒరిజినల్ లో పృథ్వీరాజ్ పోషించిన పాత్రను బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పోషించనున్నాడు. అలాగే సత్యదేవ్ కూడా కీ రోల్ కోసం ఎంపికయ్యాడు. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు స్టార్ నటుడు మాధవన్ కూడా ఈ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో వివేక్ ఒబెరాయ్ రోల్ ను మాధవన్ చేస్తాడు.
ఈ చిత్రానికి గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసిన విషయం కూడా తెల్సిందే. ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా ఆర్బీ చౌదరి, రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది గాడ్ ఫాదర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.