
టాలీవుడ్ లో మైత్రి మూవీ మేకర్స్ హవా మాములుగా లేదు. వరసగా టాప్ సినిమాలను నిర్మిస్తోంది. స్టార్ హీరోలతో చిత్రాలని లైన్లో పెట్టింది. అంతే కాకుండా మరింత మందికి అడ్వాన్స్ లు ఇచ్చి లాక్ చేసింది ఈ సంస్థ. ఇదే కోవలో బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ కు కూడా మైత్రి మూవీ మేకర్స్ అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ప్యాన్ ఇండియా సినిమాలపై మైత్రి ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలోనే సల్మాన్ ఖాన్ కు ఏకంగా 10 కోట్ల రూపాయల అడ్వాన్స్ ను ఇచ్చింది. సల్మాన్ 2023 నుండి ఈ సంస్థకు డేట్స్ ఇస్తానని ప్రామిస్ చేసాడు. ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ సల్మాన్ ను డైరెక్ట్ చేయగలిగే దర్శకుడి కోసం చూస్తోంది.
ప్రస్తుతానికైతే చాలా మంది దర్శకులను కన్సిడర్ చేస్తున్నారు కానీ త్వరలోనే ఒక డైరెక్టర్ ను కన్ఫర్మ్ చేయాలనుకుంటున్నారు. చూడాలి మరి మైత్రి మూవీ మేకర్స్ ఏ దర్శకుడితో సినిమాను సెట్ చేస్తుందో.