Homeటాప్ స్టోరీస్చిరంజీవి గాడ్ ఫాదర్ ఛాన్స్ కొట్టేసిన అనసూయ

చిరంజీవి గాడ్ ఫాదర్ ఛాన్స్ కొట్టేసిన అనసూయ

anasuya roped in for megastars god father
anasuya roped in for megastars god father

జబర్దస్త్ హాట్ యాంకర్ అనసూయ ఇప్పుడు సినిమాల్లో బిజీగా మారుతోంది. వరసగా బడా సినిమాల్లో ఆఫర్స్ కొట్టేస్తోంది. ఇప్పటికే పుష్ప చిత్రంలో ఇంపార్టెంట్ రోల్ చేస్తోన్న అనసూయ, కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తోన్న రంగమార్తాండ చిత్రంలో కూడా నటిస్తోంది. వీటితో పాటు రవితేజ నెక్స్ట్ సినిమా ఖిలాడీలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు మెగాస్టార్ చిత్రంలో నటించే అవకాశం సంపాదించింది ఈ భామ. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రాన్ని చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమాలో అనసూయ కీ రోల్ చేస్తోందని సమాచారం.

- Advertisement -

ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు. అలాగే సత్యదేవ్, నయనతార కూడా ప్రముఖ పాత్రలను పోషిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. గాడ్ ఫాదర్ మలయాళ సూపర్ హిట్ చిత్రం లూసిఫెర్ కు రీమేక్ గా తెరకెక్కింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All