
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య తర్వాత వరసగా సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెల్సిందే. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫెర్ ను తెలుగులో గాడ్ ఫాదర్ పేరిట రీమేక్ చేస్తున్నాడు. మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకుడు కాగా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తోన్న భోళా శంకర్ గురించి కూడా అధికారిక అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు ముహూర్తం కుదిరింది. నవంబర్ 11న చిత్రాన్ని ప్రారంభించి, నవంబర్ 15 నుండి రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెడతారు.
ఇది చిరు కెరీర్ లో 153వ సినిమా కాగా ఇప్పుడు 154వ సినిమా గురించి మరింత అప్డేట్ వచ్చింది. చిరు 154 చిత్రాన్ని కెఎస్ బాబీ డైరెక్ట్ చేయనున్న విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని నవంబర్ 6న ఉదయం 11 గంటల 43 నిమిషాలకు లాంచ్ చేయనున్నారు. అలాగే చిరంజీవి ఫస్ట్ లుక్ ను అదే రోజున మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాలకు రివీల్ చేయనున్నారు. మెగాస్టార్ మాస్ మూలవిరాట్ అని దర్శకుడు దీన్ని సంభోదించడంతో ఆసక్తి పెరిగింది.
చాలా కాలం తర్వాత మెగాస్టార్ ఫుల్ మాస్ సినిమాలో నటించబోతుండడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. వాల్తేర్ శీనుగా చిరు ఈ చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు.
Celebration doesn’t end with Diwali!
In front, there is MEGA festival ??
More #PoonakaaluLoading on 6th November ??
Megastar @KChiruTweets @dirbobby @ThisIsDSP ?? pic.twitter.com/bujADOPRrH
— Mythri Movie Makers (@MythriOfficial) November 4, 2021