
టాలీవుడ్‌లో పెద్దా చిన్నా అంటూ చాలా సినిమాల షూటింగ్‌లు దాదాపు ఏడు నెలలుగా ఆగిపోయాయి. దేశ వ్యాప్తంగా అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్‌లకు అనుమతులు ఇవ్వడంతో ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా మొదలవుతున్నాయి. ముందుకుగా కింగ్ నాగార్జున బిగ్‌బాస్ సీజన్ 4 షూటింగ్ మొదలుపెట్టారు.
ఆ తరువాత తను నటిస్తున్న `వైల్డ్ డాగ్` మూవీ షెడ్యూల్ స్టార్ట్ చేశారు. దీంతో స్టార్ హీరోల చిత్రాలు కూడా వరుసగా మొదలయ్యాయి. త్వరలో బాలకృష్ణ – బోయపాటి ఫిల్మ్ కూడా ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం `ఆచార్య` కూడా స్టార్ట్ కాబోతోందంటూ వార్తలు షికారు చేస్తున్నాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం `ఆచార్య` ఇప్పట్లో స్టార్టయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. చిరంజీవి ఏజ్ దృష్ట్యా ఈ చిత్రాన్ని మరో రెండు నెలల తరువాత రీ స్టార్ట్ చేద్దామని దర్శకుడు కొరటాల శివ అన్నట్టు తెలుస్తోంది. పరిస్థితుల్లో మార్పులు ఏర్పడిన తరువాతే `ఆచార్య` షూట్‌ని స్టార్ట్ చేయాలని కొరటాల భావిస్తున్నారట. చిరు కూడా అందుకు ఓకే చెప్పినట్టు తెలిసింది.