
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం `ఆచార్య`. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అయితే ఇంతకు ముందు ఈ పాత్ర కోసం త్రిషని చిత్ర బృందం ఎంపిక చేసింది. అయితే అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం నుంచి త్రిష తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది.
తరువాత తను ఈ చిత్రం నుంచి తప్పుకున్నానని, కొన్ని సృజనాత్మక విభేధాల కారణంగానే తాను తప్పుకున్నానని వెల్లడించింది. అంతే కాకుండా కొన్ని ముందు చెప్పినట్టుగా వుండవని సోషల్ మీడియా వేదికగా షాకిచ్చింది. దీంతో `ఆచార్య` టీమ్ చిరుకు జోడీగా చాలా మంది హీరోయిన్‌లని ప్రయత్నించి చివరికి రామ్‌చరణ్ చొరవతో కాజల్ అగర్వాల్‌ని ఫైనల్ చేశారు.
త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇదిలా వుంటే ఈ టీమ్‌పై మరోసారి త్రిష కామెంట్ చేసినట్టు తెలిసింది. కొన్ని విషయాలు మనం ఊహించినట్టుగా జరగవు. ఆ కారణంగానే తాను `ఆచార్య` టీమ్ నుంచి బయటికి రావాల్సి వచ్చిందని మరోసారి స్పష్టం చేయడం ఆసక్తికరంగా మారింది.